కమొడిటీస్
ఈ వారం
బంగారం
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.48,537 కంటే దిగువకు రానంత వరకు సానుకూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. అయితే రూ.49,765 వద్ద కాంట్రాక్టుకు గట్టి నిరోధం కనిపిస్తోంది. ఈ వారం కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేసే ప్రధాన పరిణామాల్లో అమెరికా ఫెరడల్ రిజర్వ్ సమావేశం ఒకటి. ఈ సమావేశంతో పాటు అమెరికా విడుదల చేసే జీడీపీ గణాంకాలపైనా ట్రేడర్లు దృష్టి సారించాలి.
* ఎంసీఎక్స్ బుల్‌డెక్స్ సూచీ ఈవారం రూ.15,495 కంటే ఎగువన కదలాడకుంటే రూ.15,282; రూ.15,170 వరకు పడిపోయే అవకాశం ఉంది.
వెండి
వెండి మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.65,002 కంటే కిందకు రాకుంటే మరింతగా పెరుగుతుందని భావించవచ్చు. రూ.64,821 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని రూ.65,151- 65,714 తక్కువ పరిణామంలోనూ కాంట్రాక్టు కొనుగోలు చేయడం మంచిదే.
* ఎంసీఎక్స్ మెటల్‌డెక్స్ సూచీ ఈవారం రూ.13,821 కంటే ఎగువన కదలాడకుంటే రూ.13,528; రూ.13,408 వరకు పడుతుందని భావించవచ్చు.
ప్రాథమిక లోహాలు
* రాగి నవంబరు కాంట్రాక్టు ఈరోజు రూ.607.80 కంటే దిగువన ముగిస్తే, రూ.612.25 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని రూ.596 లక్ష్యంతో షార్ట్‌సెల్ పొజిషన్లు తీసుకోవచ్చు. ఒకవేళ రూ.612.45 కంటే ఎగువన ముగిస్తే కాంట్రాక్టు మరింత రాణిస్తుందని అనుకోవచ్చు.
* సీసం నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.161.85 కంటే కిందకు వస్తే రూ.162.85 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని షార్ట్‌సెల్ చేయొచ్చు. రూ.163.35 ఎగువన నిలదొక్కుకుంటే రూ.162.35 దిగువన స్టాప్‌లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్లను కొనసాగించవచ్చు.
* జింక్ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.218.55 కంటే ఎగువన కదలాడకుంటే రూ.217.45 దరిదాపులో కాంట్రాక్టును షార్ట్‌సెల్ చేయొచ్చు. రూ.210.85 కంటే దిగువకు వస్తే మరింతగా పడిపోయే అవకాశమూ ఉంది.
* అల్యూమినియం ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.164.30 కంటే ఎగువన చలించకుంటే.. నష్టాలబాట పట్టే అవకాశం ఉంది. రూ.159-161 లక్ష్యానికి రూ.164.30 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని షార్ట్ సెల్ పొజిషన్లు తీసుకోవచ్చు.
* నికెల్ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.1,367 కంటే ఎగువన చలించకుంటే రూ.1,306- రూ.1,284 వరకు కాంట్రాక్టు పడిపోయే అవకాశం ఉంది.
ఇంధన రంగం
* సహజవాయువు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.188.10 కంటే ఎగువన కదలాడకుంటే రూ.170 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. షార్ట్ సెల్ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.188.10కి స్టాప్‌లాస్ సవరించుకుని, కొనసాగించవచ్చు.
* ముడి చమురు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.3,930 కంటే ఎగువన కదలాడకుంటే మరింతగా పడిపోవచ్చు. ఇంతకుముందు నమోదైన కనిష్ఠ స్థాయిలకూ దిగిరావచ్చు.
* ముడి పామోలిన్ నూనె (సీపీఓ) ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం మరింతగా దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల రూ.946.25 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని షార్ట్ సెల్ పొజిషన్లు కొనసాగించవచ్చు.
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం రూ.5,743- రూ.6,653 శ్రేణికి పరిమితమై చలించే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఒకవేళ పెరిగినా అది పరిమితంగానే ఉండొచ్చు.
* జీలకర్ర మార్చి కాంట్రాక్టును ఈవారం రూ.12,936- రూ.13,036 మధ్య కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. అయితే రూ.12,757 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
* సోయాబీన్ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.4,462 వరకు పడిపోయే అవకాశం ఉంది.
- ఆర్ఎల్పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?