దిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పెట్రోరసాయనాల వ్యాపారాన్ని కొత్త విభాగంగా విడదీయడాన్ని పూర్తిచేసింది. వ్యూహాత్మక భాగస్వామ్యాలతో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కంపెనీ పేర్కొంది. పెట్రోరసాయనాల (ఓ2సీ) వ్యాపార విభాగం చేతిలో రిలయన్స్ చమురు రిఫైనరీ, పెట్రోరసాయనాల ఆస్తులు, రిటైల్ ఇంధన వ్యాపారం ఉంటాయి. కేజీ-డీ6 వంటి చమురు- గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలు, జౌళి వ్యాపారం ఇందులో భాగంకావు. గత శుక్రవారం ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాల్లో మొదటిసారిగా ఓ2సీ వ్యాపార ఆదాయాలను రిలయన్స్ కలిపి చూపించింది. ఇంతకు ముందు రిఫైనింగ్, పెట్రోరసాయనాల వ్యాపారాల ఫలితాలను వేర్వేరుగా కంపెనీ ప్రకటించేది. మొత్తం రిటైల్ వ్యాపారంలో ఇంధన రిటైలింగ్ ఆదాయం భాగంగా ఉండేది కాదు. సౌదీ అరామ్కో వంటి కంపెనీలకు వాటాలను విక్రయించే ఉద్దేశంతో గతేడాది ఓ2సీ వ్యాపారాన్ని వేరే విభాగంగా విడదీసే ప్రక్రియను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?