close

Published : 25/01/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరొచ్చు

యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ప్రశాంత్‌ కుమార్‌

ముంబయి: తమ బ్యాంక్‌ ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి పతాక స్థాయికి చేరిందని ప్రైవేటు రంగ యెస్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. మొండి బకాయిల గుర్తింపుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెల్లడయ్యాక, స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) మరింత పెరిగే అవకాశం లేకపోలేదని తెలిపారు. మొత్తం ఆస్తుల్లో సుమారు 20 శాతానికి జీఎన్‌పీఏ నిష్పత్తి చేరొచ్చని అంచనా వేశారు. గత వారాంతంలో వెల్లడించిన డిసెంబరు త్రైమాసిక ఫలితాల ప్రకారం, జీఎన్‌పీఏలు 15.36 శాతంగా ఉన్నాయి. ‘ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి తీవ్రస్థాయికి చేరినా, కొన్ని సానుకూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కలెక్షన్లు మెరుగవుతున్నాయి. చెక్‌ బౌన్స్‌ రేట్‌ పరిశ్రమ సరాసరి స్థాయికి తగ్గింది. రికవరీలు కూడా పెరిగాయ’ని ప్రశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు.
* 2020 డిసెంబరు 31 నాటికి బ్యాంక్‌ జారీ చేసిన రూ.1.69 లక్షల కోట్ల రుణాల్లో రూ.18,551 కోట్లకు పైగా రుణాలు ఒత్తిడిలో ఉన్నాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని