close

Updated : 25/01/2021 07:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బీపీసీఎల్‌ వినియోగదారులకు అదనపు రివార్డు పాయింట్లు

ముంబయి: ఖాతాదారుల సంఖ్యను పదింతలు పెంచుకుని పది లక్షల మందికి చేరువ కావాలని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) భావిస్తోంది. ‘స్మార్ట్‌డ్రైవ్‌’ పథకం కింద ‘గెట్‌ 100ఎక్స్‌ బోనస్‌ పెట్రోమైల్స్‌’ పేరిట బీపీసీఎల్‌ కొత్త రివార్డు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్మార్ట్‌డ్రైవ్‌ యాప్‌ ద్వారా చేసే ఇంధన కొనుగోలు లావాదేవీలపై అదనపు బోనస్‌ రివార్డ్‌ పాయింట్లను వినియోగదారులు పొందొచ్చు. ఈ కార్యక్రమం మార్చి 31 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్‌ను లక్ష మంది వినియోగిస్తుండగా, రూ.20 కోట్ల విలువైన నెలవారీ లావాదేవీలు జరుగుతున్నాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని