మార్చిలో జియోకు 79 లక్షల కనెక్షన్లు - akh connections to Geo in March
close

Updated : 19/06/2021 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చిలో జియోకు 79 లక్షల కనెక్షన్లు

దిల్లీ: గత మార్చిలో రిలయన్స్‌ జియోకు కొత్తగా 79 లక్షల కనెక్షన్లు జతచేరడంతో, మొత్తం కనెక్షన్లు 42.29 కోట్లకు చేరాయని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌కు 40.5 లక్షలు జతవడంతో మొత్తం కనెక్షన్లు 35.23 కోట్లకు, వొడాఫోన్‌ ఐడియాకు 10.8 లక్షల కనెక్షన్లు జతై, మొత్తం 28.37 కోట్లకు చేరాయి. దేశీయంగా మొత్తం టెలికాం కనెక్షన్ల సంఖ్య 120.1 కోట్లకు చేరిందని, ఫిబ్రవరి కంటే ఇది 1.12 శాతం అధికమని ట్రాయ్‌ పేర్కొంది.

జీవనకాల గరిష్ఠానికి విదేశీ మారకపు నిల్వలు

దిల్లీ: దేశ విదేశీ మారకపు నిల్వలు జీవనకాల గరిష్ఠానికి చేరాయి. జూన్‌ 11తో ముగిసిన వారంలో 3.074 బిలియన్‌ డాలర్లు పెరిగి 608.081 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది. జూన్‌ 4తో ముగిసిన వారంలో ఇవి 605.008 బిలియన్‌ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఇక సమీక్షా వారంలో (11తో ముగిసిన) విదేశీ కరెన్సీ ఆస్తులు 2.567 బిలియన్‌ డాలర్లు పెరిగి 563.457 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు కూడా 496 మిలియన్‌ డాలర్లు అధికమై 38.101 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వద్ద ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌) 1 మిలియన్‌ డాలరు తగ్గి 1.512 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల స్థితి 11 మిలియన్‌ డాలర్లు పెరిగి 5.011 బిలియన్‌ డాలర్లకు చేరిందని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని