ఆధార్-పాన్ అనుసంధానం చేయ‌క‌పోతే లావాదేవీలు నిలిచిపోతాయి - Why-aadhaar-pan-link-important
close

Published : 14/06/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆధార్-పాన్ అనుసంధానం చేయ‌క‌పోతే లావాదేవీలు నిలిచిపోతాయి

ఆధార్‌-పాన్ అనుసంధానానికి జూన్ 30,2021 చివ‌రితేదీ అని ఆదాయ ప‌న్ను శాఖ తెలిపింది,  అనుసంధానం చేయ‌క‌పోతే ఆ త‌ర్వాత ఇక పాన్ కార్డ్ ప‌నిచేయ‌దు. అప్పుడు బ్యాంకు ఖాతా, మ్యూచువ‌ల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్‌, ఇత‌ర పెట్టుబ‌డుల విష‌యంలో లావాదేవీలు నిలిచిపోతాయ‌ని ఆర్థిక స‌హాదారులు సూచిస్తున్నారు. 

పెట్టుబడిదారులందరూ తమ పాన్-ఆధార్ లింక్ స్టేట‌స్‌ను ఒక‌సారి చెక్ చేసుకోవాలి. ఒక‌వేళ ఇప్ప‌టికీ అనుసంధానం చేయ‌క‌పోతే వెంట‌నే చేసేయాలి.   బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం లేక‌పోతే టీడీఎస్ రెట్టింపుగా ఉంటుంది. ఆధార్ ఉన్న బ్యాంకు ఖాతాల‌కు సాధార‌ణంగా టీడీఎస్ 10 శాతం ఉంటుంది.

కేవైసీ పూర్తి చేయ‌క‌పోతే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో లావాదేవీలు నిచిపోతాయి. ఎందుకంటే కేవైసీ కోసం పాన్ త‌ప్ప‌నిస‌రి. పనిచేయని పాన్ కార్డు కారణంగా, ఎన్‌ఎస్‌డీఎల్, స‌డీడీఎస్ఎల్‌ పెట్టుబడి రికార్డులను నిల్వ చేయలేనందున స్టేట్‌మెంట్ పొందడం కష్టమవుతుందని చెప్తున్నారు. పనిచేయని పాన్ కార్డ్ కారణంగా, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన‌ బ్యాంకింగ్ లావాదేవీకి రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే జరిమానా విధించవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని