పన్ను వసూళ్లు 86% పెరిగాయ్‌ - Tax collections increased by 86pct to Rs 5.57 lakh crore in April-June
close

Published : 27/07/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పన్ను వసూళ్లు 86% పెరిగాయ్‌

ఏప్రిల్‌- జూన్‌లో రూ.5.57 లక్షల కోట్లు

దిల్లీ: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో పన్నుల వసూళ్లు నికరంగా 86 శాతం పెరిగి రూ.5.57 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో ప్రత్యక్ష పన్నులు రూ.2.46 లక్షల కోట్లు కాగా.. పరోక్ష పన్నులు రూ.3.11 లక్షల కోట్లు అని లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. ‘2021-22 మొదటి త్రైమాసికంలో నికర ప్రత్యక్ష పన్నులు రూ.2,46,519.82 కోట్లు. 2020-21లో ఇదే త్రైమాసికంలోని రూ.1,17,783.87 కోట్లతో పోలిస్తే ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 109.30 శాతం వృద్ధి ఉంద’ని ఆయన పేర్కొన్నారు. పరోక్ష పన్నుల వసూళ్లు రూ.1,82,862 కోట్ల నుంచి 70.3 శాతం పెరిగి రూ.3,11,398 కోట్లకు చేరాయని తెలిపారు. నల్లధనం (వెల్లడించని విదేశీ ఆదాయాలు- ఆస్తులు సహా), పన్నుల విధింపు చట్టం-2015 కింద 107కి పైగా ఫిర్యాదులు దాఖలయ్యాయి. 2021 మే 31 నాటికి ఈ చట్టం కింద 166 కేసుల్లో తీర్పులు వెల్లడయ్యాయి. తద్వారా రూ.8,316 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. హెచ్‌ఎస్‌బీసీ కేసుల్లో రూ.8,465 కోట్ల మేర వెల్లడించని ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తేవడంతో పాటు రూ.1,294 కోట్ల జరిమానా విధించారు. ఐసీఐజే (ఇంటర్నేషనల్‌ కన్షార్షియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌) కేసుల్లో సుమారు రూ.11,010 కోట్ల వెల్లడించని ఆదాయాన్ని గుర్తించారు. పనామా, ప్యారడైజ్‌ పేపర్ల లీక్‌ కేసులకు సంబంధించి వరుసగా రూ.20,078 కోట్లు; రూ.246 కోట్ల వెల్లడించని ఆదాయాన్ని గుర్తించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని