180 రెట్లు ఓవ‌ర్ స‌బ్స్‌క్రైబ్ అయిన `త‌త్వ చింత‌న్` ఐపీఓ - Tatva-Chintan-IPO-was-subscribed-over-180-times
close

Published : 27/07/2021 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

180 రెట్లు ఓవ‌ర్ స‌బ్స్‌క్రైబ్ అయిన `త‌త్వ చింత‌న్` ఐపీఓ

`త‌త్వ చింత‌న్` ఐపీఓ 180 రెట్లు ఓవ‌ర్ స‌బ్స్‌క్రైబ్ అయ్యింది. ఈ ఐపీఓకు పెట్టుబ‌డిదారుల నుండి భారీ స్పంద‌న వ‌చ్చింది. షేర్లు జులై 29న `ఎన్ఎస్ఈ, బీఎస్ఈ`ల‌లో లిస్ట్ చేయ‌బ‌డ‌తాయి. `త‌త్వ చింత‌న్` ఐపీఓలో షేర్ల కేటాయింపు ఈ రోజు జ‌రుగుతుంది. రూ. 500 కోట్ల ఐపీఓ ప్రారంభ‌మైన గంట‌ల్లోనే పూర్తిగా ఓవ‌ర్ స‌బ్స్‌క్రైబ్ అయ్యింది. రిటైల్ విభాగం 35 రెట్లు, అర్హ‌త క‌లిగిన సంస్థాగ‌త కొనుగోలుదారులు 185 రెట్లు, సంస్థేత‌ర పెట్టుబ‌డిదారులు 512 రెట్లు `త‌త్వ చింత‌న్` షేర్ల కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ షేర్ల కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకున్న పెట్టుబ‌డిదారులు దీని రిజిస్ట్రార్ `లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్` వెబ్‌సైట్‌లో షేర్ల కేటాయింపును త‌నిఖీ చేసుకోవ‌చ్చు. షేర్ల‌లో కేటాయింపు ఖ‌రారైన త‌ర్వాత `త‌త్వ చింత‌న్` ఐపీఓ పెట్టుబ‌డిదారులు `బీఎస్ఈ` వెబ్‌సైట్‌లో వారి షేర్ల ధ‌ర‌ఖాస్తు స్థితిని చెక్ చేసుకోవ‌చ్చు.

మార్కెట్ ప‌రిశీల‌కుల అభిప్రాయం ప్ర‌కారం `త‌త్వ చింత‌న్` షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 1,150 కంటే ఎక్కువ ప్రీమియంతో కోట్ అవుతున్నాయి. ఇది బ‌ల‌మైన లిస్టింగ్‌కు అవ‌కాశం ఉంద‌ని సూచిస్తుంది. బ్రోక‌రేజ్‌ల స‌మాచారం ప్ర‌కారం జులై 29న `ఎన్ఎస్ఈ, బీఎస్ఈ`ల‌లో షేర్లు లిస్ట్ కావ‌చ్చు.

ఈ వ‌డోద‌ర ఆధారిత స్పెషాలిటీ కెమిక‌ల్ త‌యారీ సంస్థ ఒక్కో షేరుకు రూ. 1,073-1,083 ధ‌ర‌ల శ్రేణిలో వాటాల‌ను ఇచ్చింది. రూ. 500 కోట్ల ఐపీఓలో  తాజా ఇష్యూగా రూ. 225 కోట్ల వ‌ర‌కు, రూ. 275 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ ఉంది. ఐపీఓకు ముందు `త‌త్వ చింత‌న్‌` కంపెనీ యాంక‌ర్ ఇన్వెస్ట‌ర్ల నుండి రూ. 150 కోట్లు వ‌సూలు చేసింది.  ఈ ఐపీఓ తాజా ఇష్యూ నుండి వ‌చ్చే ఆదాయంతో సంస్థ ఉత్పాద‌క స‌దుపాయాల విస్త‌ర‌ణ‌కు, ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సౌక‌ర్యాల ఆధునీక‌ర‌ణ‌కు, సాధార‌ణ కార్పొరేట్ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగించ‌బ‌డుతుంది.

కంపెనీ ప్ర‌తిపాదిత సామ‌ర్ధ్య విస్త‌ర‌ణ‌, కంపెనీ ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ పెరుగుద‌ల‌, ఆర్ అండ్ డీ సామ‌ర్ధ్యాలు, వ్య‌వ‌సాయ ర‌సాయ‌న రంగంలో ఉన్న అవ‌కాశాల‌ను పుష్క‌లంగా వినియోగించుకునేందుకు కంపెనీ బాగా సిద్ధంగా ఉంద‌ని, `త‌త్వ చింత‌న్` ఐపీఓ ద్వారా షేర్లకు చందా తీసుకోవ‌చ్చ‌ని ప‌లు బ్రోక‌రేజీలు సిఫార‌సు చేశాయి. `త‌త్వ చింత‌న్` ఉత్ప‌త్తులు భార‌త్‌లో ఏర్పాటైన అనేక ముఖ్య‌మైన ర‌సాయ‌న కంపెనీల‌కు ఉత్ప్రేర‌కంగా ఉప‌యోగించ‌బ‌డుతున్నాయి. `త‌త్వ చింత‌న్` కొన్ని ఉత్ప‌త్తుల‌కు ప్ర‌పంచంలోనే 2వ అతిపెద్ద స్థానాన్ని పొందుతుంది. మెర్క్‌, బేయ‌ర్ ఏజీ, ఏషియ‌న్ పెయింట్స్ లిమిటెడ్ వంటి నెట్‌వ‌ర్క్ కంపెనీల‌తో బ‌ల‌మైన క‌స్ట‌మ‌ర్ సంబంధాన్ని క‌లిగి ఉంది. `త‌త్వ చింత‌న్` 25 దేశాల‌కు ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేస్తుంది. చైనాలో ష‌ట్‌డౌన్లు, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ర‌క‌మైన ఉత్ప‌త్తులు ఉత్ప‌త్తి చేసే సామ‌ర్ధ్యం లేనందువ‌ల్ల‌, ఎగుమ‌తి మార్కెట్లో భార‌త్ లాభం పొందుతుంద‌ని విశ్లేష‌కులు పేర్కోన్నారు. 2021 మార్చి 31తో ముగిసిన సంవ‌త్స‌రంలో `త‌త్వ చింత‌న్ ` రూ. 300.35 కోట్ల ఆదాయంపై రూ. 52.26 కోట్ల లాభం ఆర్జించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని