Stock market: స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు! - Stock markets are in red
close

Published : 28/09/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 114 పాయింట్లు నష్టపోయి 59,963 వద్ద.. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 17,835 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.71 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో స్థిరపడ్డాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు డీలాపడ్డాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని