Stock market: లాభాల్లో సూచీలు - Stock market indices are in green
close

Updated : 22/06/2021 09:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల్లో సూచీలు

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో 52,814 వద్ద.. నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 15,845 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 74.19గా కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. వీటితో పాటు దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో మారుతీ, టాటా స్టీల్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఆటో, పవర్‌ గ్రిడ్‌, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని