Stock market: సూచీలకు లాభాల కళ - Stock market ended in deep green
close

Updated : 17/05/2021 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: సూచీలకు లాభాల కళ

ముంబయి: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజులో మరింత జోరందుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌ 848 పాయింట్లు లాభపడి 49,580 వద్ద ముగియగా.. నిఫ్టీ 245 పాయింట్లు ఎగబాకి 14,923 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 49,628 వద్ద, నిఫ్టీ 14,938 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.22 వద్ద నిలిచింది.

అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లకు చైనా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం వంటి సానుకూల పరిణామాలు తోడవ్వడంతో నేడు లాభాల్లో పయనించాయి. ఇక దేశీయంగా వరుసగా నాలుగో రోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఈరోజు పాజిటివ్‌ కేసులు మూడు లక్షలకు దిగువకు రావడం మదుపర్ల సెంటిమెంటును పెంచింది. అలాగే అపోలోలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం, డీఆర్‌డీఓ 2డీజీ అనే కరోనా ఔషధాన్ని విడుదల చేయడం, రెండో విడత స్పుత్నిక్‌-వి టీకాలు భారత్‌కు చేరడం, కొత్త వేరియంట్లపైనా కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తుందన్న వార్తలు సూచీల సెంటిమెంటును బలపర్చాయి. అలాగే గత వారం వరుస నష్టాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, ఆర్థిక వంటి కీలక రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అలాగే రూపాయి మారకం విలువ సైతం బలపడింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల జోరు చూపించాయి.

సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభాల్లో ముగియగా.. భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, మారుతీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని