Stock: లాభాలతో ప్రారంభమైన సూచీలు - Stock Market Indices trading Higher
close

Updated : 17/05/2021 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock: లాభాలతో ప్రారంభమైన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం నేటి నుంచి అందుబాటులోకి రావడం వంటి పరిణామాల నుంచి మదుపర్లు సంకేతాలు తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 225 పాయింట్లు లాభపడి 48,953 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 14,736 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.27 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. 

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో పయనిస్తుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని