తక్కువ వడ్డీతో..కారు రుణాలు కావాలా?  - Should-you-opt-for-flexible-car-loans
close

Updated : 17/05/2021 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తక్కువ వడ్డీతో..కారు రుణాలు కావాలా? 

సాధార‌ణ కారు రుణానికి బ‌దులుగా, రుణ‌గ్ర‌హీత స్టెప్‌-అప్ ప‌థ‌కం, బెలూన్ ప‌థ‌కం లాంటివి ఎంచుకోవ‌చ్చు. వేర్వేరు రుణ విధానాల వెనుక ఉన్న ఆలోచ‌న ఏమిటంటే, కొనుగోలుదారుల‌కు వారి న‌గ‌దు ల‌భ్య‌త‌ను బ‌ట్టి రుణం తిరిగి చెల్లించే సౌలభ్యాన్ని అందించ‌డం.

కార్ల త‌యారీదారులు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. రుణ సంస్థ‌ల‌తో ఒప్పందం కుదుర్చుకుని సౌక‌ర్య‌వంత‌మైన కారు రుణాలు అందిస్తున్నాయి. పైసాబ‌జార్‌.కామ్ నుండి వ‌చ్చిన డేటా ప్ర‌కారం, రుణ‌గ్ర‌హీత‌లు 7 - 7.5% వ‌డ్డీ రేట్ల వ‌ర‌కు కొత్త కారు రుణాలు పొంద‌వ‌చ్చు.

ఈ కారు రుణ ప‌థ‌కంలో ఒక దానిలో రుణ సంస్థ ప్రారంభంలో త‌క్కువ స‌మాన‌మైన నెల‌వారీ వాయిదాల‌ను (ఈఎమ్ఐ)ల‌ను అనుమ‌తిస్తుంది. ఈ ఈఎమ్ఐ కాల‌క్ర‌మేణా పెరుగుతుంది. మ‌రొక ప‌థ‌కంలో ర‌ణ‌గ్ర‌హీత‌లు మొద‌టి 6 నెల‌లు త‌క్కువ ఈఎమ్ఐల‌ను చెల్లిస్తారు. త‌ర్వాత అధిక ఈఎమ్ఐలు చెల్లిస్తారు.  త‌క్కువ ఈఎమ్ఐ చెల్లించిన‌పుడు చెల్లించాల్సిన వ‌డ్డీని అస‌లు జోడించి దానిపై వ‌డ్డీని వ‌సూలు చేస్తారు. అందువ‌ల్ల చెల్లించాల్సిన అస‌లు మొత్తం + వ‌డ్డీ పెరుగుతుంది.

స్టెప్‌-అప్ రుణాల‌లో, రుణ‌గ్ర‌హీత‌లు పొందే ఒక ప్ర‌యోజ‌నం ఏమిటంటే వారు అధిక రుణ మొత్తాన్ని పొంద‌వ‌చ్చు. ప్రారంభ ఈఎమ్ఐ త‌క్కువ‌గా ఉన్నందున రుణ గ్రహీత పెద్ద మొత్తంలో రుణం పొందుతారు. ఇటువంటి రుణాలు సాధార‌ణంగా రుణగ్ర‌హీత‌లు వారి ఆదాయం భ‌విష్య‌త్తులో పెరుగుతుంద‌ని భావిస్తారు. అయితే కొన్ని నెల‌ల్లో మీ ఆర్థిక ప‌రిస్థితులు బాగుంటాయ‌ని మీరు విశ్వ‌సిస్తేనే అలాంటి రుణాలు ఎంచుకోవాలి. ఒకవేశ అనిశ్చితి ఉంటే స్టెప్‌-అప్ రుణాలు తీసుకోక‌పోవ‌ట‌మే మంచిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని