close

Updated : 04/05/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Stock market: ఆద్యంతం ఒడుదొడుకులమయం!

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య ట్రేడింగ్‌ కొనసాగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకొని, తిరిగి పుంజుకొని మధ్యాహ్నం వరకూ నిలకడగా సాగాయి. అనంతరం ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో అంతకంతకూ దిగజారుతూ ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. ఉదయం 48,881 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 465 పాయింట్లు కోల్పోయి 48,253 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 48,996 వద్ద గరిష్ఠాన్ని, 48,149 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ చివరకు 137 పాయింట్లు దిగజారి 14,496 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 73.85 వద్ద నిలిచింది. కొవిడ్‌ భయాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు, ఆసియా మార్కెట్ల డీలా, కీలక కంపెనీల షేర్ల బలహీనత దేశీయ సూచీలపై ప్రభావం చూపింది.

సెన్సెక్స్‌ 30 సూచీలోని ఎనిమిది కంపెనీలు మినహా మిగతా కంపెనీల షేర్లన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫినాన్స్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడగా.. రిలయన్స్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని