Stock market: సెన్సెక్స్‌ @59 వేలు.. బ్యాంక్‌ షేర్ల అండతో మరోసారి గరిష్ఠాలకు సూచీలు - Sensex Nifty settle at fresh closing highs
close

Updated : 16/09/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: సెన్సెక్స్‌ @59 వేలు.. బ్యాంక్‌ షేర్ల అండతో మరోసారి గరిష్ఠాలకు సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి దూసుకెళ్లాయి. వాహన, టెలికాం రంగాలకు కేంద్ర కేబినెట్‌ ఇచ్చిన బూస్ట్‌తో బుధవారం జీవనకాల గరిష్ఠాలను తాకిన సూచీలు.. గురువారం నాటి ట్రేడింగ్‌లోనూ అదే దూకుడును కనబరిచాయి. దీంతో సెన్సెక్స్‌ 59,000 మార్కుపైన ముగియగా.. నిఫ్టీ 17,600 పాయింట్లపైన స్థిరపడింది. ఈ నెల 3న తొలిసారి సెన్సెక్స్‌ 58 వేల మార్కును అందుకోగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించింది. ముఖ్యంగా బ్యాంక్‌ షేర్లు రాణించడంతో సూచీలు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి.

ఉదయం 58,856 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే దూకుడు కొనసాగించింది. ఒక దశలో 59,204 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 418 పాయింట్లు లాభపడి 59,141.16 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 17,644 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుని చివరికి 110 పాయింట్ల లాభంతో 17,629.50 వద్ద స్థిరపడింది. ప్రధానంగా నిఫ్టీ పీసీయూ బ్యాంక్‌ సూచీ 5.43 శాతం, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీ 2.67 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 2.22 శాతం లాభాన్ని చవిచూసింది. బీఎస్‌ఈలో సుమారు 400 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా.. 280 స్టాక్స్‌ 52 వారాల గరిష్ఠాలను చేరుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 73.52గా నమోదైంది. నిఫ్టీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. భారత్‌ పెట్రోలియం, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ, టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని