శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బ్యాంక్‌ షేర్లు పడేశాయ్‌..

ముంబయి: దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఆటో షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనవ్వడంతో సెన్సెక్స్‌ 674.36 పాయింట్లు నష్టపోయి 27,590.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 170 పాయింట్లు నష్టపోయి 8,083.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.06 వద్ద కొనసాగుతోంది.  ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది.

ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ పట్ల ఉన్న దృక్పథాన్ని స్థిరత్వం నుంచి ప్రతికూలంగా మార్చడంతో బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో దాదాపు అన్ని బ్యాంకింగ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. మరోవైపు భారత వృద్ధిరేటు అంచనాలను ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ తగ్గించడం మార్కెట్లపై ప్రభావం చూపాయి. విదేశీ మార్కెట్లు షాంఘై, హాంకాంగ్‌ నష్టాలతో ముగియగా.. టోక్యో, సియోల్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యాయ. నిఫ్టీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాలు చవిచూశాయి. సన్‌ఫార్మా, సిప్లా, ఐటీసీ, గెయిల్‌ షేర్లు లాభాల బాట పట్టాయి.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)