పొగాకుపై పన్ను పెంచండి.. జీఎస్టీ కౌన్సిల్‌కు విజ్ఞప్తి - Public health groups and doctors demand higher tax on tobacco products
close

Published : 16/09/2021 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొగాకుపై పన్ను పెంచండి.. జీఎస్టీ కౌన్సిల్‌కు విజ్ఞప్తి

హైదరాబాద్: ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి అన్ని పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ పెంచాలని వైద్యులు, ఆర్థికవేత్తలతో పాటు ప్రజారోగ్య సంఘాల ప్రతినిధులు జీఎస్టీ మండలిని కోరారు. సెప్టెంబర్ 17న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కానున్న నేపథ్యంలో తమ అభ్యర్థనను పరిగణించాలని వారు విజ్ఞప్తి చేశారు. పొగాకు నుంచి వచ్చే ఈ పన్ను ఆదాయం కొవిడ్‌ మహమ్మారి వేళ ఉపయోగపడుతుందని, వ్యాక్సిన్లు, మూడో వేవ్‌ ఎదుర్కోవడానికి కావాల్సిన ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని వారు ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

కొవిడ్‌ మొదటి వేవ్‌ కంటే రెండో వేవ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం పడిందని వారు పేర్కొన్నారు. దీంతో పలు ఉద్దీపన చర్యలను కేంద్రం ప్రకటించిందన్నారు. దేశం మూడో వేవ్‌కు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్సును పెంచాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ నిర్ణయం వల్ల ఆదాయం పెరగడమే కాకుండా పొగాకు సంబంధిత వ్యాధులను అరికట్టినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగదారుల జాబితాలో దేశం రెండో స్థానంలో ఉందని, ఏటా లక్షల సంఖ్యలో మరణిస్తున్నారని విచారం వ్యక్తంచేశారు. దేశంలోని క్యాన్సర్లకు 27 శాతం పొగాకే కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ పెంచడం ఉత్తమమైన ప్రతిపాదన అని, ఆదాయం పెంచడంతో పాటు యువతను పొగాకు దూరంగా ఉంచేందుకు ఉపకరిస్తుందని వాలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ భావనా ముఖోపాధ్యాయ అభిప్రాయపడ్డారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని