close

Published : 19/04/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రయాణతేదీ మార్పులకు ఛార్జీల్లేవు: ఎయిరేషియా ఇండియా

దిల్లీ: మే 15 వరకు ప్రయాణానికి బుక్‌ చేసుకున్న వారు, ప్రయాణతేదీ, సమయం మార్చుకునేందుకు ఎటువంటి ఛార్జీ వసూలు చేయబోమని ఎయిరేషియా ఇండియా ఆదివారం ప్రకటించింది. కొవిడ్‌ కేసుల విస్తృతి వల్ల ఏర్పడ్డ అనిశ్చితిలో ప్రయాణికులకు ఊరట కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో, ఇండిగో, స్పైస్‌జెట్‌ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్న సంగతి విదితమే.


స్పెక్ట్రమ్‌పై ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను సవాలు చేద్దాం
 ఎయిర్‌సెల్‌, ఆర్‌కామ్‌ రుణదాతల నిర్ణయం
 రూ.60,000 కోట్లు కోల్పోతామని ఆందోళన

దిల్లీ: స్పెక్ట్రమ్‌ విక్రయానికి సంబంధించి జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేయాలని ఎయిర్‌సెల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) రుణదాతలు నిర్ణయించారు. సహజ వనరు అయిన స్పెక్ట్రమ్‌కు చెల్లింపులు జరపని సంస్థలకు వాటిపై హక్కు ఉండదని, వాటిని దివాలా స్మృతి కింద పరిగణనలోకి తీసుకోవద్దని ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. ఇది కనుక అమలైతే ఎయిర్‌సెల్‌, ఆర్‌కామ్‌లకు ఇచ్చిన రుణాలు రూ.60,000 కోట్లు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మారతాయని ఆర్థిక సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ సంస్థల స్పెక్ట్రమ్‌ పొందేందుకు బిడ్డింగ్‌లో యూవీ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ అర్హత పొందింది. ఎయిర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌కు ముందస్తుగా రూ.150 కోట్లు, రాబోయే అయిదేళ్లకు మరో రూ.6630 కోట్లు చెల్లిస్తామని ఆ సంస్థ పేర్కొంది. ఆర్‌కామ్‌, దాని అనుబంధ సంస్థల స్పెక్ట్రమ్‌కు రూ.14,000 కోట్లు చెల్లిస్తామనీ తెలిపింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు అమలైతే ఆర్‌కామ్‌, రిలయన్స్‌ టెలికాం రుణ పరిష్కార ప్రణాళికపైనా ప్రభావం పడుతుందని, మొత్తంమీద దేశ, విదేశీ బ్యాంకులకు రూ.60,000 కోట్ల ఎన్‌పీఏలుగా మారే ప్రమాదముందన్నది వారి వాదన.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని