బ్యాంకులు, బీమా సంస్థల్లో క్లెయిమ్‌ చేయని మొత్తాలు రూ.49,000 కోట్లు - Nearly Rs 49000 crore lying unclaimed with banks insurers
close

Published : 28/07/2021 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకులు, బీమా సంస్థల్లో క్లెయిమ్‌ చేయని మొత్తాలు రూ.49,000 కోట్లు

దిల్లీ: బ్యాంకులు, బీమా కంపెనీల్లో ఎవరూ క్లెయిమ్‌ చేయని (అన్‌క్లెయిమ్డ్‌) మొత్తాలు సుమారు రూ.49,000 కోట్ల వరకు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2020 డిసెంబరు 31కి బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఎవరూ క్లెయిమ్‌ చేయని మొత్తం      రూ.24,356 కోట్లు ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపిందన్నారు. 2019 ఆఖరుతో పోలిస్తే 2020లో ఇలాంటి డిపాజిట్లు రూ.5,977 కోట్ల మేర పెరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి డిపాజిట్లు ఎస్‌బీఐలో రూ.3,577 కోట్లు, ఇతర జాతీయ బ్యాంకుల్లో రూ.16,596 కోట్లు, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో రూ.2,963 కోట్లు, విదేశీ బ్యాంకుల్లో రూ.612 కోట్లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రూ.601 కోట్లు, స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంకుల్లో రూ.4.24 కోట్లు, లోకల్‌ ఏరియా బ్యాంకుల్లో  రూ.70 లక్షల మేర ఉన్నట్లు వివరించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు బీమా కంపెనీల వద్ద పాలసీదారులు క్లెయిమ్‌ చేయని మొత్తాలు రూ.24,586 కోట్లు ఉన్నట్లు రాజ్యసభకు భగవత్‌ తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని