గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నేపాల్‌ అధికార పార్టీలో చీలిక తప్పదా?

మరోసారి ఎన్‌సీపీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం వాయిదా

కాఠ్‌మాండూ: నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ) స్టాండింగ్‌ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. నేడు జరగాల్సిన  భేటీని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇలా ఈ సమావేశం వాయిదా పడడం ఇది ఐదోసారి. ప్రధాని ఓలీ, పార్టీ ఛైర్మన్‌ పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ మధ్య ఏర్పడ్డ తీవ్ర స్థాయి విభేదాలు పరిష్కారం కాకపోవడమే దీనికి కారణమని సమాచారం.  ఇలా చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో పార్టీ చీలిక దిశగా సాగుతున్నట్లు వస్తున్న ఊహాగానాలు బలపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

భారత్‌కు వ్యతిరేకంగా ఓలీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సహా ఆయన చర్యలపై ప్రచండతో పాటు అనేక మంది నాయకులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దీంతో నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. మరోవైపు ఈ విభేదాల్ని చల్లార్చి పార్టీ చీలికను అడ్డుకోవాలని చైనా యత్నిస్తోంది. ఈ మేరకు నేపాల్‌లోని ఆ దేశ రాయబారి హో యాంకీ పలుసార్లు పార్టీ నాయకులతో భేటీ అయ్యారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని