గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బఫెట్‌ను వెనక్కి నెట్టేసిన ముఖేశ్‌ అంబానీ

ముంబయి: భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో ఆయన అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్‌ బఫెట్‌ను వెనక్కినెట్టారు. బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. ఆసియా నుంచి టాప్‌-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్‌ కావడం గమనార్హం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చాలని కంకణం కట్టుకున్న ముఖేశ్‌ ఆ పనిలో విజయవంతమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ విలువ 68.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. బఫెట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హాథ‌వే 67.9 బిలియన్‌ డాలర్లను దాటేసింది. ఐతే‌ 2.9 బిలియన్‌ డాలర్లను విరాళంగా ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడంతో బఫెట్‌ తొమ్మిదో స్థానానికి దిగిపోయారు. 2006లోనూ 37 బిలియన్‌ డాలర్లను విరాళం ఇవ్వడంతో ఆయన ర్యాంకు తగ్గిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగంలో ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ సహా కొన్ని కంపెనీలు 15 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ చమురు రిటైల్‌ వ్యాపారంలో బీపీ పీఎల్‌సీ బిలియన్‌ డాలర్ల వాటా కొనుగోలు చేసింది. మొత్తంగా 2020లో ఎంఅండ్‌ఏ ద్వారా 12శాతానికి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని