Stock Market: నష్టాల నుంచి కొత్త రికార్డుల్లోకి.. - Market indices ended marginally higher amid volatile session
close

Updated : 14/06/2021 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: నష్టాల నుంచి కొత్త రికార్డుల్లోకి..

ముంబయి: తీవ్ర ఊగిసలాట నడుమ దేశీయ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. అయినప్పటికీ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో పాటు దేశీయంగా మదుపర్ల లాభాల స్వీకరణతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు భారీ నష్టాలతో మొదలుపెట్టాయి. 52,492 పాయింట్ల వద్ద మొదలైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఒక దశలో 51,936 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీ మళ్లీ 52,591 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. చివరకు 76.77 పాయింట్ల స్వల్ప లాభంతో 52,551.53 వద్ద కొత్త రికార్డులో ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 15,600 - 15,830 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 12.50 పాయింట్ల అత్యల్ప లాభంతో 15,811.85 వద్ద తాజా జీవనకాల గరిష్ఠ స్థాయిలో స్థిరపడింది. 

ఎఫ్‌పీఐ ఖాతాల స్తంభనతో అదానీ గ్రూప్‌ షేర్లు నేడు భారీగా పతనమయ్యాయి. ఎన్ఎస్‌ఈలో అదానీ పోర్ట్స్‌ షేర్లు దాదాపు 10శాతం మేర కుంగాయి. ఇక కోల్‌ ఇండియా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ షేర్లు నష్టపోగా.. దివిస్‌ ల్యాబ్స్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని