శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

లింక్డ్‌ఇన్‌లో జాబ్‌ పోస్టింగ్‌ ఉచితం

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారితో పోరాడుతున్న సంస్థలకు లింక్డ్‌ఇన్‌ తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. క్లిష్ట సమయంలో లాభాపేక్షలేకుండా పనిచేస్తున్న సంస్థలు ఏప్రిల్‌ ఒకటి నుంచి జూన్‌ 30 వరకు తమ ఉద్యోగ ప్రకటనల్ని లింక్డ్ఇన్‌లో ఉచితంగా పోస్ట్ చేసుకునే  వెసులుబాటుని కల్పించింది. దీంతో దేశవ్యాప్తంగా కృషిచేస్తున్న హెల్త్‌కేర్‌, సూపర్‌ మార్కెట్లు, గిడ్డంగులు, సరకు రవాణా సంస్థలు ఉద్యోగులను ఉచితంగా నియమించుకునే అవకాశాన్ని కల్పించింది.

ముఖ్యంగా హెల్త్‌కేర్‌ రంగంలో సిబ్బందిని నియమించుకునేందుకు లింక్డ్ఇన్‌  ‘టాలెంట్ ఇన్‌సైట్స్’ పేరున మూడు నెలల పాటు వైద్యరంగంలోని నిపుణులు, ఉద్యోగార్థుల వివరాలను అందులో పొందుపరచనుంది. దీంతోపాటు ‘రీక్రూటింగ్‌ ఫర్‌ గుడ్‌’ అనే ప్రొగ్రామ్‌ ద్వారా స్వయంగా తమ సిబ్బందితోనే  నైపుణ్యాలకి అనుగుణంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగులను, వాలంటీర్లను నియమించుకుంటోంది. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సంస్థలు వెంటనే ఈ సిబ్బందిని భర్తీ చేసుకోడానికి అవకాశం దొరుకుతుంది. ‘ప్రజలకోసం కరోనాపై  వీరోచితంగా పోరాడుతున్న గాధలు వింటున్నాం. దీన్ని ఎదుర్కొనేందుకు ఇంకా చాలా మంది సహాయం కావాలి. సంబంధిత విభాగాల్లో నైపుణ్యాలున్న సిబ్బందిని నియమించుకునే  ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని లింక్డ్ఇన్‌ ఇండియా డైరెక్టర్‌ రుచీ ఆనంద్‌ తెలిపారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)