హైబ్రిడ్‌ విద్యుత్‌ వాహన బ్యాటరీల వారంటీ 8 ఏళ్లు: టయోటా - Hybrid electric vehicle batteries Warranty 8 years Toyota
close

Updated : 29/07/2021 07:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైబ్రిడ్‌ విద్యుత్‌ వాహన బ్యాటరీల వారంటీ 8 ఏళ్లు: టయోటా

దిల్లీ: స్వీయ ఛార్జింగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల (ఎస్‌హెచ్‌ఈవీలు) బ్యాటరీల వారంటీ గడువును ఆగస్టు 1 నుంచి పొడిగించబోతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యాటరీలకు మూడేళ్లు లేదా 1,00,000 కి.మీ. వారెంటీ గడువు ఉండగా, దీన్ని 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీ.కు (ఏది ముందైతే అది) పొడిగించనున్నట్లు టీకేఎం అసోసియేట్‌ జనరల్‌ మేనేజర్‌ (సేల్స్‌ అండ్‌ వ్యూహాత్మక మార్కెటింగ్‌) వి.వైజ్‌లైన్‌ సిగమణి వెల్లడించారు.


అమెరికా సాంకేతిక దిగ్గజాలు అదరహో

ఏప్రిల్‌- జూన్‌లో మూడింటి సంయుక్త లాభం 50 బి.డాలర్లు

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన మూడు సాంకేతిక దిగ్గజ కంపెనీలు- యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లు ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు కనబర్చాయి. ఈ మూడింటి లాభం 50 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.75 లక్షల కోట్ల)కు చేరింది. ఈ మూడు సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 6.4 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.480 లక్షల కోట్ల)కు చేరింది. 16 నెలల క్రితం కొవిడ్‌-19 ప్రారంభానికి ముందు ఉన్న ఈ సంస్థల మొత్తం మార్కెట్‌ విలువతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం.

* భారత్‌లో రెండంకెల వృద్ధి: యాపిల్‌
భారత్‌, లాటిన్‌ అమెరికా లాంటి విపణుల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి మొత్తం మీద 81.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వెల్లడించారు. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలోని 59.6 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఆదాయం 36 శాతం పెరిగిందని పేర్కొన్నారు. నికర లాభం కూడా 11.2 బిలియన్‌ డాలర్ల నుంచి పెరిగి 21.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. 

* గూగుల్‌ లాభం మూడు రెట్లు
గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఏప్రిల్‌- జూన్‌లో 18.53 బిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని నమోదుచేసింది. కిందటేడాది ఇదే సమయంలోని 6.96 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే నికర లాభం సుమారు 3 రెట్లు పెరిగింది. ప్రకటనల ద్వారా ఆదాయం 69 శాతం వృద్ధితో 50.44 బిలియన్‌ డాలర్లకు చేరింది.

* మైక్రోసాప్ట్‌.. 47% వృద్ధి
ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్‌ నికర లాభం 47 శాతం పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. నికర ఆదాయం 21 శాతం వృద్ధితో 46.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని