గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

హోండా సివిక్‌ డీజిల్‌ వెర్షన్‌

 ప్రారంభ ధర రూ.20.75 లక్షలు

దిల్లీ: హోండా కార్స్‌ ఇండియా ప్రీమియం సెడాన్‌ మోడల్‌ సివిక్‌లో బీఎస్‌-6 నిబంధనలకు లోబడిన డీజిల్‌ వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. డీజిల్‌ సివిక్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు రూ.20.75 లక్షలు, రూ.22.35 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. 2019 మార్చి నుంచి కంపెనీ సివిక్‌ మోడల్‌లో బీఎస్‌-6 పెట్రోల్‌ వెర్షన్‌ను విక్రయిస్తోంది. కొత్త డీజిల్‌ సివిక్‌ వెర్షన్‌తో వినియోగదారులు తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే సౌలభ్యం కలిగిందని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, అమ్మకాలు) రాజేశ్‌ గోయల్‌ అన్నారు. డీజిల్‌ సివిక్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లో కూడా లభించనుంది. 1.6 లీటర్‌ టర్బో ఇంజిన్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లు 120 పీఎస్‌ శక్తిని అందిస్తాయి. లీటర్‌కు 23.9 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కలిగిన 17.7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 8 వే పవర్‌ డ్రైవర్‌ సీట్‌, ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని