close

Published : 19/04/2021 11:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరోగ్య బీమా ప్రీమియం ధ‌ర‌లు పెరుగుతాయా ?

ఆరోగ్య బీమా సంస్థ‌లు బీమా ప్రీమియం రేట్ల‌ను పెంచే అవ‌కాశ‌ముంది.

క‌రోనా మ‌హమ్మారిపై మొత్తం ప‌రిస్థితి ఎంత త్వ‌ర‌గా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంద‌నే దానిపై ఆరోగ్య బీమా ధ‌ర‌లు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్‌-19 సంబంధిత స‌మ‌స్య‌లు బాగా పెర‌గ‌డంతో పాటు ఈ అంటువ్యాధుల‌ను అదుపు చేయ‌క‌పోతే ఆరోగ్య బీమా సంస్థ‌లు వార్షిక ప్రీమియంల‌ను 20% పెంచ‌వ్చ‌ని ఒక అంచ‌నా.

ఆరోగ్య బీమా అంచ‌నాల ప్ర‌కారం, కోవిడ్‌-19 క్లెయిమ్స్ కార‌ణంగా ఆరోగ్య బీమా సంస్థ‌ల నిక‌ర ఆదాయాల‌పై క‌నీసం 20% ప్ర‌భావం ఉంటుంది. కొత్త పాల‌సీల కోసం ప్రీమియంల ధ‌ర‌లు పెంచ‌డానికి బీమా సంస్థ‌లు ఆలోచిస్తాయ‌ని సీనియ‌ర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

2020 ఆర్ధిక సంవ‌త్స‌రానికి ఆరోగ్య బీమా సంస్థ‌ల ఆదాయం సుమారు రూ. 40 వేల కోట్లు. ఇది కోవిడ్‌-లింక్డ్ ఉత్ప‌త్తుల అధిక అమ్మ‌కాలు, ఇత‌ర స‌మ‌గ్ర ఆరోగ్య క‌వ‌ర్ పాల‌సీల‌కు దారితీసింది. ఈ కార‌ణంగా సంపాదించిన మొత్తం స్థూల ప్రీమియం 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 15-20% అధికంగా ఉంది. అయితే విలువ ప‌రంగా కోవిడ్ పాల‌సీల నుండి వచ్చిన మొత్తం ఆరోగ్య ప్రీమియంలో 30% ఉంటుంద‌ని ఆరోగ్య బీమా ప్ర‌తినిధులు తెలిపారు.

కోవిడ్‌-19 కేసులు, క్లెయిమ్స్ సంఖ్య పెరిగితే, బీమా సంస్థ‌లు `ఐఆర్‌డీఏఐ`ను సంప్ర‌దించి ధ‌ర‌ల‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డ‌టానికి  అవ‌కాశ‌ముంది. మార్చి త‌ర‌వాత క్లెయిమ్‌ల రేటు పెరుగుతోంది. భార‌త్‌లో కోవిడ్‌-19 కేసులు పెరుగుద‌ల‌కు, క్లెయిమ్‌ల రేటుకు త‌ప్ప‌నిస‌రిగా సంబంధం ఉంటుంది. క్లెయిమ్‌ల సంఖ్య గ‌తేడాది సెప్టెంబ‌రులో అత్య‌ధికం. కానీ ఇపుడు క్లెయిమ్స్ గ‌త సెప్టెంబ‌ర్ సంఖ్య కంటే రెట్టింపు కంటే ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంది.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో కోవిడ్‌-19 చికిత్స‌ల నిమిత్తం ఆరోగ్య బీమా సంస్థ‌ల‌కు సుమారుగా రూ. 17 వేల కోట్ల క్లెయిమ్స్ వ‌చ్చాయి. అయితే కోవిడ్‌-19 భ‌యం, కోవిడ్‌-19 బీమా పాల‌సీల‌ను కొన‌డానికి చాలా మందిని ప్రేరేపించింది. అందువ‌ల్ల క్లెయిమ్స్ కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ఇది ఆరోగ్య బీమా ప‌రిశ్ర‌మ‌పై భారీ ప్ర‌భావం ఉంటుంది.

ఆరోగ్య బీమా డేటా ప్ర‌కారం, కోవిడ్‌-19 పాల‌సీల క్లెయిమ్స్ ప‌రంగా, ఆరోగ్య బీమా ప‌రిశ్ర‌మ క్లెయిమ్‌ల‌లో మొత్తం 5వ వంతు క్లెయిమ్‌ల‌ను క‌లిగి ఉంటాయి.

ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు కోవిడ్‌-19 కేసుల పెరుగుద‌ల‌ను అదుపు చేయ‌డంలో విఫ‌ల‌మైతే క్లెయిమ్ గ‌ణాంకాలు అంచ‌నాకు మించి పెరుగుతాయి. ఇది ఆరోగ్య బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్రీమియం వ్య‌యంలో 15-20% పెరుగుద‌ల‌కు దారితీయొచ్చు.

కోవిడ్‌-19 ఆరోగ్య బీమా ర‌క్ష‌ణ‌కు పాల‌సీల‌ను విక్ర‌యించే 32 సాధార‌ణ బీమా సంస్థ‌లు దేశంలో ఉన్నాయి. `ఐఆర్‌డీఏఐ` లెక్క‌ల ప్ర‌కారం 2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో సాధార‌ణ బీమా సంస్థ‌ల మొత్తం స్థూల ప్రీమియం రూ. 1.98 ల‌క్ష‌ల కోట్లు లోపులో ఉన్నాయి. అయితే 2021 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కు, ఆరోగ్య బీమా రంగం మొత్తం ప్రీమియం రూ. 52,886.54 కోట్లు వసూలు చేసింది.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని