గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయ్‌

 గిరాకీ పెంచేందుకు మరిన్ని చర్యలు
 ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌

దిల్లీ: ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గాడిన పడుతున్నాయని, గిరాకీని మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ పేర్కొన్నారు. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీరేట్లు మరింత తగ్గించవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. ‘ఇప్పటికే ప్రభుత్వం భారీ ఉద్దీపన పథకాలను ప్రకటించింది. ఇవన్నీ గిరాకీని పెంచేందుకు ఉద్దేశించినవే. భవిష్యత్తులో కూడా వడ్డీరేట్లతో పాటు ఆర్థిక సాయం రూపేణ కూడా మరిన్ని చర్యలుంటాయి’ అని వివరించారు. ‘వడ్డీరేట్లు తగ్గించేందుకు ఇంకా అవకాశాలున్నాయి. పశ్చిమ ఐరోపా వంటి దేశాల్లో చూస్తే 0 శాతం లేక ప్రతికూల వడ్డీరేట్లు అమల్లో ఉన్నాయి’ అని ఇండియా గ్లోబల్‌ వీక్‌ 2020 సమావేశాల్లో సన్యాల్‌ చెప్పారు. ‘వడ్డీరేట్లు గణనీయంగా తగ్గించేందుకు మార్గాలున్నాయి, ఆర్‌బీఐ క్రమానుగతంగా ఈ చర్య తీసుకుంటోంది. ఇక జీడీపీతో పోలిస్తే, రుణాల శాతం కూడా అమెరికా, బ్రిటన్‌, ఇతర ఐరోపా దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువగానే ఉంది. అందువల్ల ఆర్థిక సాయం కూడా చేయొచ్చు’ అని పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్‌ సమయంలో గిరాకీ పెంచేందుకు చర్యలు తీసుకున్నా, ప్రయోజనం ఉండదు. అందుకే దశలవారీగా లాక్‌డౌన్‌ ఉపసంహరణకు అనుగుణంగా ఈ చర్యలూ ఉంటాయి. వ్యవసాయం, కార్మికులకు సంబంధించి, సరఫరా వ్యవస్థల్లో పలు సంస్కరణలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొవిడ్‌-19 సంక్షోభం కొనసాగుతుండగానే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. వినియోగదారుల వ్యవహారశైలి బాగా మారింది. అందువల్ల అన్ని అంశాలను గమనించకుంటూ, గిరాకీ పెంచేలా విధానాలు రూపొందిస్తారు’ అని వెల్లడించారు.
తొలి త్రైమాసికంలో వృద్ధి -20 శాతం!: ఈ వెబినార్‌లో పాల్గొన్న సిటీ ఇండియా సీఈఓ ఆశు ఖుల్లార్‌ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం మన దేశానికి అత్యంత కఠినంగా ఉందని, వృద్ధి 20 శాతం మేర క్షీణించవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థల ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండబోవన్నారు. సరఫరా వ్యవస్థల్లో తెచ్చిన సంస్కరణలు బాగున్నాయని ప్రశంసించారు. వడ్డీరేట్ల తగ్గింపుతో పాటు ద్రవ్య లభ్యతకు ఆర్‌బీఐ మంచి చర్యలు తీసుకుంటోందన్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని