గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి 11 యాప్‌ల తొలగింపు

దిల్లీ: వినియోగదారులకు భద్రతాపరంగా మరింత మెరుగైన సేవలు అందిచడంలో భాగంగా గూగుల్‌ సంస్థ ప్లేస్టోర్‌ నుంచి 11 యాప్‌లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఈ యాప్‌లన్నింటిలో జోకర్ మాల్‌వేర్‌ అనే వైరస్‌ను గూగుల్ గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెక్‌ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ తెలిపింది. వినియోగ దారులు వెంటనే ఈ యాప్‌లను తమ మొబైల్ ఫోన్‌ల నుంచి తొలగించాలని సూచించినట్లు సమాచారం.

ఈ యాప్‌ల ద్వారా మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ప్రవేశించి వినియోగదారుల ప్రమేయం లేకుండా ప్రీమియం సర్వీసులను సబ్‌స్క్రైబ్‌ చేసుకోగలవని తెలిపారు. ఈ విషయాన్ని గూగుల్‌ ప్లే ప్రొటెక్షన్‌ ఫ్రేమ్‌వర్క్‌ కూడా గుర్తించలేదని తెలిపారు. వినియోగదారుల డేటాకు భంగం కలిగించే యాప్‌లను గుర్తించి గూగుల్‌ వాటిని తరచుగా తొలగిస్తుంటుంది. అందులో భాగంగా ఈ నెల మొదట్లో కూడా నిబంధనలు ఉల్లంఘించడం, సమాచార అపహరణ ఆరోపణల కింద 25 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్ తొలగించింది. వీడియో/ఫొటో  ఎడిటింగ్, వాల్‌పేపర్, ఫ్లాష్‌ లైట్ యాప్‌లకు వినియోగదారుల నుంచి ఎక్కువ ఆదరణ ఉండటంతో అటువంటి వాటి నుంచే మాల్‌వేర్‌ వ్యాప్తి జరుగుతుందని పలు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

తొలగించిన 11 యాప్‌లు ఇవే..

com.imagecompress.android

com.contact.withme.texts

com.hmvoice.friendsms

com.relax.relaxation.androidsms

com.cheery.message.sendsms (two different instances)

com.peason.lovinglovemessage

com.file.recovefiles

com.LPlocker.lockapps

com.remindme.alram

com.training.memorygame

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని