5జీ ట్రయల్స్‌కు టెలికాంశాఖ అనుమతి - DoT approves telcos applications for 5G trials
close

Updated : 04/05/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

5జీ ట్రయల్స్‌కు టెలికాంశాఖ అనుమతి

న్యూదిల్లీ: దేశంలో 5జీ ట్రయల్స్‌కు టెలికాం మంత్రిత్వశాఖ మంగళవారం అనుమతి ఇచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌లు 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించవచ్చని అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని వాడకూడదని స్పష్టం చేసింది. ఎరిక్‌సన్‌, నోకియా, శాంసంగ్‌, సీ-డాట్‌తో పాటు రిలయన్స్‌ జియో సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో 5జీ ట్రయల్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలకు అనుమతి లభించడం విశేషం.

చైనాకు చెందిన హువాయ్‌ టెక్నాలజీని ఉపయోగించి ట్రయల్‌ చేస్తామని భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ప్రతిపాదించాయి. ఆ తర్వాత చైనా కంపెనీల టెక్నాలజీ సాయం లేకుండానే ట్రయల్స్‌ నిర్వహిస్తామని ప్రకటించాయి. ‘ఈ టెలికాం కంపెనీలు అన్నీ ఎరిక్‌సన్‌, నోకియా, శాంసంగ్‌, సి-డాట్‌ అభివృద్ధి చేసి టెక్నాలజీ సాయం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఒక్క రిలయన్స్‌ జియో మాత్రమే సొంతంగా అభివృద్ధి చేసుకున్న టెక్నాలజీని వాడుతోంది. ఆరు నెలల పాటు ఈ ట్రయల్స్‌ నిర్వహించాలి. సామగ్రి సిద్ధం చేసుకోవడానికి రెండు నెలల సమయం పడుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని