☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 04/03/2021 04:56 IST
సైబర్‌ కియోస్క్‌లు వస్తున్నాయ్‌!

తొలి దశలో దిశ పోలీసు స్టేషన్లు, ఆ తర్వాత బస్టాండ్లలో ఏర్పాటు

ఈనాడు, అమరావతి: మన సెల్‌ఫోన్‌కు వచ్చే ఏవేవో లింకులను మనకు తెలియకుండానే క్లిక్‌ చేసేస్తుంటాం... వివిధ రకాల మోసపూరిత యాప్‌లను అసంకల్పితంగా డౌన్‌లోడ్‌ చేసేస్తుంటాం.. ఫలితంగా వాటి మాటున దాగున్న సైబర్‌ నేరాల ముప్పును తెలిసీతెలియక ఆహ్వానిస్తుంటాం. ఎప్పుడో ఒకప్పుడు నేరం బారిన పడి బాధితులుగా మారిన తర్వాత ఈ సమస్య ఎక్కడ తలెత్తిందని గుర్తించే ప్రయత్నం చేస్తాం. అదే ఎప్పటికప్పుడు మన సెల్‌ఫోన్‌లోకి మాల్‌వేర్‌ ఏమైనా ప్రవేశించిందా? హ్యాక్‌ అయిందా? అనేది తెలుసుకుంటూ.. వాటిని తొలగించుకోగలిగితే చాలావరకూ సైబర్‌ నేరాల బారిన పడే అవకాశం తగ్గుతుందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అందుకోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ కియోస్కులను ఏర్పాటు చేయనున్నారు. వాటికి మన సెల్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్‌, మెమరీ కార్డు, ఇతర డివైస్‌లను అమర్చితే చాలు.. నిమిషాల వ్యవధిలో అందులోని మాల్‌వేర్స్‌, సైబర్‌ నేరాల ముప్పు కలిగించే ఇతరత్రా హాని కారకాల్ని తొలగించి శుభ్రం చేస్తాయి. తొలి దశలో రాష్ట్రంలోని అన్ని దిశ పోలీసు స్టేషన్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, రాష్ట్ర సచివాలయం, డీజీపీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కోటి రూ.2 లక్షల విలువైన మొత్తం 50 కియోస్కులను ఈ నెల కొనుగోలు చేయనున్నారు. గుజరాత్‌లోని జాతీయ ఫోరెన్సిక్‌ సైన్సు విశ్వవిద్యాలయం ద్వారా వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చింది. రెండో దశలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇలా దశల వారీగా అన్ని చోట్లా వీటిని అందుబాటులో ఉంచాలనేది ప్రణాళిక. ‘దిశ’ పేరుతో ఈ కియోస్కులను నిర్వహించనున్నారు.

మరిన్ని

  • ‘చిత్ర’వార్తలు
  • హనుమంతుడు మనవాడే!హనుమంతుడు తెలుగువాడేనని, ఆయన జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని తగిన ఆధారాలతో శ్రీరామనవమినాడు ప్రకటించేందుకు తితిదే సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమత్‌ ఉపాసకుడు డాక్టర్‌
  • చదువుల తోటలో చల్లని గాలిబెజవాడలో ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లినప్పుడు చెట్టు నీడ కనిపిస్తే ప్రాణానికి ఎంతో హాయిగా అనిపిస్తోంది.
  • బుజ్జి ఆవుకు.. బుల్లి దూడతూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం పడమటిపాలెంలో గుండాబత్తుల మధుకి చెందిన పుంగనూరు ఆవు 13.50 అంగుళాల
  • కొవిడ్‌కు ‘అడ్డు’సరం!అడ్డసరం.. ఔషధ మొక్కగా దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. వీటి ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును మందుల తయారీలో

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.