గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

మా త్యాగాన్ని రాజకీయం చేయొద్దు

అమరావతి రైతుల ఆగ్రహం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని కోసం ఉదారంగా భూములిచ్చిన తమ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేయొద్దని అమరావతి రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం చేయకూడదన్న ఆలోచన ఉంటే ప్రభుత్వ పెద్దలు తుళ్లూరు వచ్చి తమ గోడు వినాలని కోరారు. భూములిచ్చిన 29వేల మంది రైతులతో మాట్లాడితే ఇక్కడి ప్రజల ఆవేదన ఏంటో తెలుస్తుందన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో ఆదివారం (208వ రోజు) నిరసనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, దొండపాడు, అనంతవరం, రాయపూడి, వెలగపూడి, వెంకటపాలెం, పెదపరిమి, మల్కాపురం తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించారు. సామాజిక వర్గం పేరుతో తమపై బురదజల్లడం సరికాదన్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని