గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

వరవరరావును జైల్లోనే చంపేయొద్దు..!

మెరుగైన ఆసుపత్రిలో చేర్పించాలి
భార్య హేమలత డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బీమా కోరేగావ్‌ కేసులో మహారాష్ట్రలోని తలోజా జైల్లో రిమాండ్‌లో ఉన్న ప్రముఖ కవి వరవరరావుకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. 81 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన్ను జైల్లోనే చంపేయొద్దని, కనీసం ప్రాణాలతోనైనా ఉండనివ్వాలంటూ విన్నవించారు. వరవరరావు సతీమణి హేమలత ఆదివారం తన కుమార్తెలు సహజ, అనల, పవన; సోదరుడు ఎన్‌.వేణుగోపాల్‌తో కలసి ఆన్‌లైన్‌లో జాతీయ, తెలుగు మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘‘మే 26న ఆయనకు ఆరోగ్యం బాగోలేదని సమాచారం అందింది. రెండు రోజుల తర్వాత ముంబయి జేజే ఆసుపత్రిలో చేర్పించారని చిక్కడపల్లి పోలీసులు చెప్పారు. జూన్‌ 2న న్యాయస్థానంలో కేసు విచారణ ఉంటే ముందు రోజే హడావుడిగా ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసి జైలుకు తరలించారు. అప్పుడే ఆయన శరీరంలో పొటాషియం, సోడియం నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయని మెడికల్‌ రిపోర్టుల ద్వారా తెలిసింది. కనీసం ఆయన్ను ప్రాణాలతోనైనా మాకు అప్పగించండి..’’ అంటూ హేమలత కోరారు.
25 కేసుల్లో ఒక్కటీ రుజువు కాలేదు
తలోజా జైల్లో ఖైదీల సామర్థ్యం 2,100 మంది అయితే ప్రస్తుతం 3,500 మందిని ఉంచారు. అక్కడ కరోనా ప్రమాదం తీవ్రంగా పొంచి ఉంది. అలాంటి జైల్లో 81 ఏళ్ల వరవరరావును ఉంచారు. ఆయనపై ఇప్పటివరకు నమోదైన 25 కేసుల్లో ఒక్కదాన్నీ రుజువు చేయలేకపోయారు.

-ఎన్‌.వేణుగోపాల్‌, హేమలత సోదరుడు

వరవరరావును ఆసుపత్రికి తరలించాలి
తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న వరవరరావును వెంటనే ముంబయిలోని జేజే ఆసుపత్రికి తరలించి మంచి చికిత్స అందించాలని పౌరహక్కుల నాయకులు డిమాండు చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.)కు రోమిల్లా థాపర్‌, ప్రభాత్‌ పట్నాయక్‌, దేవికా జైన్‌, మజదరువాల, సతీశ్‌ దేశ్‌పాండే లేఖ రాశారు.
ఫోన్‌లో చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు
జైల్లో సరైన చికిత్స లేకపోవడంతో నాన్న ఆరోగ్యం రోజురోజుకీ దెబ్బతింటోంది. నిన్న మాట్లాడినప్పుడు బాగున్నారా? అని అడిగితే..‘ బాగున్నా.. బాగున్నా.. ఐయామ్‌ గుడ్‌.. ఐయామ్‌ గుడ్‌..’ అంటూ చిన్నపిల్లాడిలా చెప్పిందే చెబుతున్నారు.

- పవన, వరవరరావు కుమార్తె

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని