☰
శుక్రవారం, మార్చి 05, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 22/01/2021 03:38 IST
వైకాపా ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట

భాజపాతో కలిసి తిరుపతి ఉప ఎన్నికలో పోటీ
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానం

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ప్రజా సమస్యలపై పోరాడేవారిని వైకాపా ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తోందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్‌, పోలీసు చట్టం 30 అమలు కాని రోజు లేకుండా పోయిందని విమర్శించింది. ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తీర్మానించింది. గురువారం తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం దాదాపు 3 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించింది. వివరాలను కమిటీ సభ్యులు కందుల దుర్గేష్‌, శ్రీనివాస యాదవ్‌, యశస్విని విలేకర్లకు వివరించారు. భాజపాతో    కలిసి తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని అభ్యర్థి ఎంపికపై మరోసారి భాజపాతో చర్చిస్తామన్నారు. అభ్యర్థి ఎంపిక, పొత్తు విషయంలో     భాజపాతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మార్చి వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేనందున అభ్యర్థి ఎంపికపై తొందరపడనక్కర్లేదని అభిప్రాయపడ్డారు. పవన్‌కల్యాణ్‌ శుక్రవారం తిరుపతి నుంచి ఒంగోలు చేరుకుని శనివారం అక్కడ పర్యటిస్తారని, ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే రాంబాబు తీరును ఖండిస్తూ నిరసన చేపడతారన్నారు.
అసెంబ్లీని ముట్టడిస్తాం
భవన నిర్మాణ కార్మికులు, నివర్‌ తుపాన్‌ నష్టంపై సమావేశంలో చర్చించామని పీఏసీ సభ్యులు తెలిపారు. బాధితులకు ఎకరాకు రూ.35 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనికి నిరసనగా సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు తెలిపారు. పార్టీ   క్రియాశీలక సభ్యత్వ నమోదుపై సమావేశంలో చర్చించినట్లు వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తిరుపతి ఉపఎన్నికపై సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారని, ఈ రెండు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. మృతి చెందిన కార్యకర్త వెంగయ్యనాయుడుకు నివాళులర్పించారు.

మరిన్ని

  • కర్ణాటక సభలో చొక్కా విప్పిన ఎమ్మెల్యేకర్ణాటక విధానసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన కొద్దిసేపటికే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అంశంపై చర్చ సందర్భంగా భద్రావతి ఎమ్మెల్యే బి.కె.సంగమేశ్‌ (కాంగ్రెస్‌) తన వ్యక్తిగత అంశంపై
  • విశాఖను దోచేస్తారు.. జాగ్రత్త!‘ఇప్పటికే ఒక్కసారి అవకాశం ఇమ్మంటే నమ్మి అధికారం కట్టబెట్టారు. రెండేళ్లలో ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. మళ్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపాను నమ్మి అధికారం ఇస్తే విశాఖ నగరాన్ని దోచేస్తారు.. జాగ్రత్త!’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు.
  • చంద్రబాబు నీటి పన్నును 33శాతం పెంచలేదా?దేశవ్యాప్తంగా చేపట్టిన సంస్కరణల్లో భాగంగానే ఆస్తి పన్ను పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘ఇతర రాష్ట్రాల్లోలా కాకుండా
  • బెదిరింపులతో నామినేషన్ల ఉపసంహరణ సాధ్యమేనా?దౌర్జన్యం చేయడం వల్లో, బెదిరించో, ఒత్తిడి తీసుకొచ్చో అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహరింపజేయడం సాధ్యమేనా? అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘అభ్యర్థులే వ్యక్తిగతంగా వెళ్లి
  • విజయవాడ తెదేపా మేయర్‌ అభ్యర్థిగా కేశినేని శ్వేతవిజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ఖరారు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • అమెరికాలో చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య
  • నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్‌
  • ప్రభాస్‌తో ఫరియా.. పాయల్‌ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
  • నేడు ఎస్‌బీఐ మెగా వేలం..!
  • ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌: కడుపుబ్బా నవ్వాల్సిందే!
  • సిరాజ్‌పై స్టోక్స్‌ స్లెడ్జింగ్‌: రంగంలోకి కోహ్లీ!
  • మనసుకు నచ్చినవాడిని మనువాడి...
  • అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్‌
  • అదృశ్యమైన యువకుల కథ విషాదాంతం
  • అలా చేసినందుకే పరాజయాలు..!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.