గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

సున్నా వడ్డీని గాలికొదిలేసింది చంద్రబాబే

వ్యవసాయ మంత్రి కన్నబాబు

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గాలికొదిలేశారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అయిదేళ్లలో బకాయిలు చెల్లించకపోవడం, రాయితీ వడ్డీ ఇవ్వకపోవడం వల్ల బకాయిలు పేరుకుపోయానని ఆయన తెలిపారు.  కొన్ని వాణిజ్య బ్యాంకులు వసూలు చేశాయన్నారు. చంద్రబాబు ఎన్నికల కోసం కొత్త రుణమాఫీ పథకం ప్రకటించినప్పుడు రుణాలన్నీ మాఫీ అవుతాయని కొందరు రైతులు కట్టడం మానేశారని, ఆ భారం సహకార బ్యాంకులపై పడిందని వివరించారు. ఫలితంగా అవి కుప్పకూలే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులను, బ్యాంకులను, సొసైటీలను ఆదుకోవడానికి ఎంత కష్టమైనా సరే సున్నా వడ్డీ పథకం అమలుకు ముఖ్యమంత్రి జగన్‌ ముందుకొచ్చారని తెలిపారు. 2007-08 నుంచి 2019 వరకు రైతులకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం రూ.1,150 కోట్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి ముందుకొచ్చారని అన్నారు. సున్నా వడ్డీ రుణాల కోసం బడ్జెట్‌లో ముఖ్యమంత్రి రూ.11 వేల కోట్లు ప్రకటించారని, ఇవి చాలకపోతే అదనంగా ఖర్చు చేస్తామని చెప్పారు. వడ్డీ రాయితీని నేరుగా రైతు ఖాతాలలోనే జమచేస్తామని వెల్లడించారు.

నేటి నుంచి ఈ-పంట అమల్లోకి
ఈ-పంట అమల్లో భాగంగా వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉమ్మడి అజమాయిషీలో ఈ నెల 13 సోమవారం నుంచి ప్రతి గ్రామంలో సర్వే చేసి పంటల సాగు విస్తీర్ణాన్ని నమోదు చేస్తారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. దీని వల్ల కచ్చిత వివరాలతోపాటు కౌలు రైతులకు మేలు చేకూరుతుందన్నారు. అన్ని పంటలకు సకాలంలో విత్తనాలు, రుణాలు అందేలా చూస్తున్నామన్నారు. రైతులకు పథకాలు అందనట్లయితే 155251 కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. 2013 నుంచి 2018 వరకు ఆప్కాబ్‌కు రూ.689 కోట్ల వడ్డీ రాయితీ రావాల్సి ఉండగా, ఐదేళ్లలో రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చారని వివరించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని