☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 25/01/2021 06:14 IST
కనిపెంచిన చేతులే.. కాటేశాయి

మదనపల్లెలో ఇద్దరు యువతుల దారుణహత్య
బిడ్డలను కొట్టి చంపిన తల్లిదండ్రులు
మూఢభక్తితోనే అఘాయిత్యం!

మదనపల్లె (నేరవార్తలు), న్యూస్‌టుడే: కనిపెంచిన చేతులే కాటేసిన దారుణమిది... క్షుద్రపూజలు చేసి ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులే కొట్టి చంపేసిన ఘోరమిది.. విద్యాబుద్ధులు చెప్పి ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన దంపతులు సొంతబిడ్డలను చేతులారా కడతేర్చిన వైనమిది.. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఆదివారం రాత్రి వెలుగు చూసిన ఈ దారుణానికి సంబంధించి పోలీసుల చెప్పిన వివరాలివి.. శివనగర్‌కు చెందిన ఎన్‌.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరంతా గత ఏడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసేవార]ని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు దిలీప్‌కుమార్‌, రమాదేవి సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మూఢభక్తే కారణమా?

డీఎస్పీ మాట్లాడుతూ హత్యకు గురైనవారు, హంతకులంతా పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయారని, వారు తమ బిడ్డలు మళ్లీ బతుకుతారని చంపేసినట్లు ప్రాథమికంగా తెలిందన్నారు. యువతుల తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపినట్లు, ఈ సంఘటన జరిగినప్పుడు తండ్రి పురుషోత్తంనాయుడు కూడా అక్కడే ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. తల్లిదండ్రులు కూడా మానసికంగా సతమతమవుతున్నట్లు గుర్తించామని, వారు ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ బాగా చదువుకుని విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారని,  మంత్రతంత్రాలకు అలవాటు పడి అఘాయిత్యం చేశారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని

  • 9,308 కేంద్రాలు.. 91 లక్షల మంది ఓటర్లురాష్ట్రంలో మార్చి 10న నిర్వహించనున్న పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలకు పురపాలక శాఖ ఏర్పాట్లు చేసింది. ...
  • హంగ్‌ వస్తే.. భాజపాతో మమత పొత్తుఆరెస్సెస్‌-భాజపా మత ఎజెండాను అపాలంటే బెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)ని ఓడించాల్సిన అవసరం...
  • సర్దుబాట్ల కా‘పురం’పుర, నగరపాలక సంస్థల్లోని వార్డు స్థానాల్లో తమ అనుచరులను బరిలో కొనసాగించేందుకు అధికార పార్టీ వైకాపాలో నేతలు పావులు...
  • స్వామీజీల తీరు బాధాకరంమంచి మార్పు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొంత మంది లోపాలు వెతుకుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి ...
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!పులి, చిరుత.. అని చెవినపడితేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ అకస్మాత్తుగా ఓ చిరుత ఎదురుపడితే ప్రాణాలు గాల్లో ...
  • కృష్ణపట్నానికి పిలుపునెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కొత్తగా సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు అంశంపై చర్చించేందుకు దక్షిణ కొరియాలోని ...
  • నేటి నుంచి మూడో దశ కొవిడ్‌ టీకారాష్ట్రంలో సోమవారం నుంచి మూడో దశ కొవిడ్‌ టీకా పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు....
  • అనంత అవకాశాల గని అంతరిక్షంఅమెరికాలోని ఏరోస్పేస్‌ తయారీ, అంతరిక్షయాన సేవల కంపెనీ ‘స్పేస్‌ఎక్స్‌’ తరహాలో మనదేశంలోనూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలు కీలకపాత్ర...
  • నామినేషన్లకు మరో అవకాశం!బలవంతపు చర్యలతో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్న, ప్రత్యేక పరిస్థితుల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో...
  • నగదు బదిలీ రూ.నాలుగేవంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తొలి నాళ్లలో.. ఒక్కో సిలిండర్‌పై రూ.170 నుంచి రూ.500 వరకు...
  • దేశీయ ప్రైవేటు ఉపగ్రహాలతో సరికొత్త చరిత్రభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోమారు చరిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది....
  • వివాదాల కొండపవిత్ర కృష్ణాతీరాన వెలిసిన ఇంద్రకీలాద్రి విశిష్టమైనది.. శక్తి మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ఈ కొండమీద కనకదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి స్వయంగా అవతరించారని స్థలపురాణం చెబుతోంది. అంతటి ప్రాశస్త్యంతో పాటు, రాష్ట్రంలోనే రెండో పెద్దదైన ఈ దేవస్థానంలో అడుగడుగునా అక్రమాలు.. అవినీతి.. ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి. ఆలయంలో ఎక్కడా ఒక వ్యవస్థ అంటూ కనిపిస్తున్న దాఖలాల్లేవు. ...

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • రేపటి సిరులు
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.