☰
శుక్రవారం, మార్చి 05, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 22/01/2021 16:58 IST
షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ పోలింగ్‌
అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ వెల్లడి
నేడు గవర్నర్‌తో భేటీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే 4 దశల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనరు (ఎస్‌ఈసీ) రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న అవరోధాల్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తొలగించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామని, ఎన్నికల తేదీలను మార్చాలని కోరబోమని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ధర్మాసనానికి తెలియజేసింది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది’ అని ఎస్‌ఈసీ వెల్లడించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, ఓటర్లను ప్రభావితం చేయరాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇప్పటికే సూచించానని తెలిపారు. మరోవైపు రమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు, తదితర అంశాల్ని ఆయనకు వివరించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేలా చూడాలని గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది.
11 జిల్లాల కలెక్టర్లతో సమావేశం
ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ గురువారం 11 జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. గత మార్చిలో స్థానిక సంస్థల   ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో... ఆ రెండు జిల్లాల కలెక్టర్లను మార్చాలని అప్పట్లోనే ప్రభుత్వానికి ఎస్‌ఈసీ     లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల   కలెక్టర్లు మినహా, మిగతా 11 జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ మాట్లాడినట్టు తెలిసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలని,  తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 23న నోటిఫికేషన్‌ వెలువడనున్నందున కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ఎస్‌ఈసీ సూచించినట్టు సమాచారం. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతో పాటు, గతంలో  ఎన్నికల కమిషన్‌ సూచించిన కొందరు పోలీసు అధికారుల్నీ విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి గురువారం మరోసారి రమేశ్‌కుమార్‌ సూచించారు. చిత్తూరు అర్బన్‌, గుంటూరు రూరల్‌ ఎస్పీలతో పాటు మరికొందరు పోలీసు అధికారుల్నీ విధుల నుంచి తప్పించాలని  ఇది వరకు రాసిన లేఖను.. గురువారం సీఎస్‌కు రాసిన లేఖకు జతచేశారు.
ఓటర్ల భద్రత ప్రభుత్వ బాధ్యతే
‘ఎన్నికల సిబ్బందితోపాటు, ఓటర్ల భద్రతనూ ఎన్నికల కమిషన్‌ దృష్టిలో ఉంచుకుంది. దాని కోసం ప్రభుత్వం పాటించాల్సిన సమగ్ర భద్రతా నియమావళిని ప్రొసీడింగ్స్‌లో పొందుపరిచింది. పోలింగ్‌ సిబ్బంది, ఓటర్లకు పూర్తి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. గత అనుభవాల్నిబట్టి శాంతి భద్రతల నిర్వహణపై కమిషన్‌ ప్రత్యేక దృష్టి పెడుతుంది’ అని ఎస్‌ఈసీ తెలిపారు. ఎన్నికల్ని స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు సహకరించాల్సిందిగా ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా నియంత్రణలోనూ గ్రామ పంచాయతీలది కీలక భూమిక’ అని ఆయన పేర్కొన్నారు.
ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు లేఖ
హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాల్ని ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లకు లేఖలు రాశారు. ఏర్పాట్లు, ఓటర్ల జాబితాల సంసిద్ధతపై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవ్వాలని ద్వివేది, గిరిజా శంకర్‌లకు ఆయన సూచించారు.

చినవేంకన్నను దర్శించుకున్న ఎస్‌ఈసీ

ద్వారకా తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గురువారం పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలను అందజేశారు. ఈవో భ్రమరాంబ శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు.


మరిన్ని

  • అదానీ చేతికి గంగవరం పోర్టు?ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టు అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోనుంది. ఈ పోర్టు కంపెనీలో 31.5% వాటాను రూ.1,954 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
  • నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
  • సీఎం ఆమోదిస్తే వైకాపాలో గంటా చేరికముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదిస్తే తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమ పార్టీలో చేరడం లాంఛనమేనని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. తిమ్మాపురంలోని తన విడిది కార్యాలయంలో
  • ‘మళ్లీ నామినేషన్ల’ ఉత్తర్వుల నిలుపుదలపురపాలక ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్‌ దాఖలుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 1న ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. నామినేషన్ల అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణ విషయంలో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది
  • శారదా పీఠానికి అనుకోని అతిథిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం విశాఖలోని శారదా పీఠాన్ని అనుకోకుండా సందర్శించారు. జీవీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి తరఫున 97వ వార్డులో పర్యటిస్తుండగా అదే ప్రాంతంలో ఉన్న శారదా పీఠాన్ని చూశారు. ఇదే శారదాపీఠం.... ముఖ్యమంత్రి జగన్‌ ఇక్కడికే వస్తుంటారని కార్యకర్తలూ వివరించారు.
  • గ్రామీణ రహదారులకు రూ.412.51 కోట్లుముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోని పులివెందుల, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల పనుల కోసం రూ.412.51 కోట్లు కేటాయించారు.
  • కేసులు పెరుగుతున్నాయ్‌!రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల్లో క్రమంగా పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. జనవరి 26 తర్వాత తొలిసారిగా 133 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 36,980 నమూనాలను పరీక్షించారు
  • 24 గంటలూ వ్యాక్సినేషన్‌కరోనా టీకా కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 60 ఏళ్లపైబడిన వృద్ధుల రద్దీ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • పీఏసీఎస్‌లను విస్తరించాలిప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను (పీఏసీఎస్‌) మరింత విస్తరించాలని, ప్రతి మూడు రైతు భరోసా కేంద్రాలకు ఒకటి చొప్పున ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆప్కాబ్‌, డీసీసీబీ, పీఏసీఎస్‌ బోర్డుల్లో మూడింట ఒక వంతు డైరెక్టర్లుగా
  • ఏకగ్రీవాల జోరుతమ అభ్యర్థులను బెదిరించి దౌర్జన్యాలకు దిగారని... అపహరించి ప్రలోభ పెడుతున్నారన్న విపక్షాల ఆరోపణల నడుమ జరుగుతున్న పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగు పురపాలక సంఘాలు అధికార పార్టీ వశమయ్యాయి. కడప జిల్లా పులివెందుల
  • పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం విశాఖకు తరలింపుఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖకు సంబంధించి విజయవాడలో రూ.13.80 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం తరలించనుంది. దీన్ని తొలుత విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందుకు అనుమతులూ మంజూరయ్యాయి.
  • యథేచ్ఛగా బెదిరింపులుపురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం కూడా బెదిరింపుల పర్వం కొనసాగింది. ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడి కొన్నిచోట్ల తెదేపా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు తెదేపా నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. వారిని రహస్య ప్రదేశాలకు పంపించి.
  • భయన్మార్‌మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు బుధవారం మరోసారి రక్తసిక్తమయ్యాయి!....

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • అమెరికాలో చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య
  • నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్‌
  • ప్రభాస్‌తో ఫరియా.. పాయల్‌ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
  • నేడు ఎస్‌బీఐ మెగా వేలం..!
  • ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌: కడుపుబ్బా నవ్వాల్సిందే!
  • సిరాజ్‌పై స్టోక్స్‌ స్లెడ్జింగ్‌: రంగంలోకి కోహ్లీ!
  • అదృశ్యమైన యువకుల కథ విషాదాంతం
  • అలా చేసినందుకే పరాజయాలు..!
  • వాన్‌ తీవ్ర విమర్శలు.. ఈ సారి పిచ్‌పై కాదు!
  • అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.