గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

చిన్న బతుకులు ఛిద్రం

పనిలేదు.. గిరాకీ రాదు
పూట గడవటమూ కష్టమే
అల్లాడుతున్న రోజువారీ కార్మికులు, చిరు వ్యాపారులు
ఈనాడు డిజిటల్‌, అమరావతి


 రోజూ ఉదయం ఏడింటికి బాక్సు కట్టుకుని బెంజి సర్కిల్‌కు వస్తున్నా. పది రోజుల నుంచి పని దొరకలేదు. ఖాళీగానే తిరిగి వెళుతున్నా. - తులశమ్మ, రోజు కూలీ, విజయవాడ


గతంలో అన్నీపోనూ రోజుకు రూ.వెయ్యి మిగిలేవి. ఇప్పుడు రెండొందలు కూడా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం మారటోరియం విధించినట్లు చెబుతున్నా.... ఫైనాన్సు సంస్థలు ఈఎంఐలు కట్టేందుకు గడువేమీ ఇవ్వట్లేదు. - సుమన్‌, ట్యాక్సీడ్రైవరు


నిర్మాణ కూలీలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రిక్షా కార్మికులు, కంప్యూటరు, మొబైల్‌ సర్వీసు సెంటర్ల నిర్వాహకులు, చిరుతిళ్ల వ్యాపారుల జీవితాలపై లాక్‌డౌన్‌ చావుదెబ్బ కొట్టింది. వ్యాపారాలు సాగకపోవడంతో వీరి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా మారుతుందోనంటూ ఆందోళన చెందుతున్నారు. నిర్మాణ కూలీలు ఏడాదిగా గడ్డురోజులను ఎదుర్కొంటున్నారు. గతేడాది జులై నుంచి ఆరు నెలలపాటు ఇసుక లేక పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత... మూడు నెలలపాటు పనులు బాగానే సాగాయి. అంతలోనే కరోనా విరుచుకుపడింది. రెండు నెలలపాటు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. పదిహేను రోజుల నుంచి ఓ మోస్తరుగా పనులు జరుగుతున్నా... పెద్దగా మార్పేమీ రాలేదు.విజయవాడ బెంజి సర్కిల్‌ అడ్డాకు గతంలో రోజూ 300 మంది వరకు కూలీలు వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య 200కి పడిపోయింది. వీరిలో రోజుకి 30 మందికైనా పని దొరకట్లేదు. ‘పొద్దున రావడం.. మధ్యాహ్నం ఇంటికి వెళ్లడం.. ఇదే సరిపోతుంది. అప్పులు చేసే బతుకుతున్నాం’ అని తాపీ మేస్త్రీ మాణిక్యాలరావు వాపోయారు.

ఆటో డ్రైవర్లు కుదేలు
విజయవాడ బస్టాండు సెంటర్‌లో కనీసం 100-150 వరకు ఆటోలుంటాయి. వాటిలో రెండు, మూడింటికి మాత్రమే రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు గిట్టుబాటవుతోంది. గతంలో ఆటోలో కనీసం అయిదుగురు కూర్చునేవారు. ఇప్పుడు.. ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ కూర్చోవడానికి వీల్లేదు. దాంతో నిర్వహణ ఖర్చులు సైతం రావట్లేదు. తినడానికి కష్టమైనా కిస్తీ మాత్రం చెల్లించాలనుకుని... ఈసారి వచ్చిన వాహనమిత్ర డబ్బంతా కట్టేశానని బెంజ్‌ సర్కిల్‌ అడ్డాకు చెందిన ఆటోడ్రైవర్‌ రాజేశ్‌ తెలిపారు.
* ‘గతంలో రోజంతా వేచి చూస్తే సరకును తరలించో... పెద్దవాళ్లు దయతలిచి ఎక్కితేనో రూ.రెండొందలైనా వచ్చేవి. ఇప్పుడు ఒక్కరు తినే మందం కూడా సంపాదించలేకపోతున్నాం’ అని విజయవాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని రిక్షా కార్మికుడు రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు.
* జనం బయటి తిళ్లపై ఆసక్తి కనబరచట్లేదని పటమటలో ఫ్రైడ్‌రైస్‌ బండి నడిపే ప్రమోద్‌, సాధారణ వ్యాపారంలో 10% కూడా జరగడంలేదని విజయవాడలో ల్యాప్‌టాప్‌ సర్వీసింగ్‌ దుకాణం నడిపే చేకూరి హరిబాబు వాపోయారు. తమలాంటి వారందరికీ ప్రభుత్వమే దారి చూపాలని కోరుతున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని