గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

పరిపాలన రాజధానికి కేంద్ర బిందువు కాపులుప్పాడ

మంత్రి ముత్తంశెట్టి వెల్లడి

గ్రామీణ భీమిలి, ఏయూ ప్రాంగణం (విశాఖపట్నం), న్యూస్‌టుడే: పరిపాలనా రాజధానికి విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ కేంద్ర బిందువు కానుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కాపులుప్పాడ గొల్లలపాలెం, నిడిగట్టు ఎస్సీ కాలనీల్లో జరిగిన బహిరంగ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా విశాఖ రాజధాని కాకుండా ఆగదన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. ప్రభుత్వం కొవిడ్‌ నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజలు ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు.  విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మహిళా వసతిగృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటోందని, ప్రజలూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని