గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

10.86 శాతం పాజిటివ్‌

రాష్ట్రంలో ఒక్క రోజులో 1,933 కేసులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒకే రోజు 2వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 10.86 శాతం మందికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 1,933 మంది దీని బారిన పడగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా ఈ వైరస్‌ సోకిన వారిలో 1,914 మంది ఏపీలో ఉంటున్నవారు కాగా, 18 మంది ఇతర రాష్ట్రాలు, ఒకరు విదేశాల నుంచి వచ్చినవారు. ఇతర రాష్ట్రాల వారిలో 16 మంది తెలంగాణ నుంచి వచ్చిన వారే. ఒకే రోజులో ఈ స్థాయిలో కేసులు రావటం, మరణాలు సంభవించటం ఇదే తొలిసారి.  మొత్తం కేసుల సంఖ్య 29,168కు, మరణాలు 328కు చేరాయి.
* 24 గంటల వ్యవధిలో 17,624 నమూనాలను పరీక్షించారు. 846 మంది కోలుకున్నారు.
* అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 268, కర్నూలులో 237, కృష్ణాలో 206 మందికి వ్యాధి వచ్చింది.
* కడప, విశాఖ, పశ్చిమగోదావరి మినహా మిగతా జిల్లాల్లోనూ నమోదైన కొత్తకేసులు వందకుపైనే ఉన్నాయి.
* కర్నూలు, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, కృష్ణా, విశాఖలో ముగ్గురేసి, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.
* కర్నూలులో మృతుల సంఖ్య 101కు చేరింది.
* శ్రీకాకుళం జిల్లా వెయ్యి కేసులకు చేరువలో ఉంది.
* 3 వేల కేసులు దాటిన జిల్లాల జాబితాలో ఇప్పటివరకూ అనంతపురం, కర్నూలు ఉండగా.. వాటి సరసన ఇప్పుడు గుంటూరు చేరింది.
* ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 11,071 మంది ఆసుపత్రుల్లో, 2,357 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో మొత్తం 13,428 మంది చికిత్స పొందుతున్నారు.
* ఇప్పటివరకూ 11,53,849 నమూనాలు పరీక్షించారు.
* చిత్తూరు జిల్లాలో స్థానిక ఛానల్‌లో ఓ సీనియర్‌ వీడియో జర్నలిస్టు మృతి చెందారు.  వెంటిలేటర్‌పై వైద్యం పొందుతూ ఆదివారం  కన్ను మూశారు.

తమిళనాడు, కర్ణాటకల్లో...
తమిళనాడులో ఆదివారం 4,244 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం బాధితుల సంఖ్య 1,38,470కి పెరిగింది. ఆదివారం 68 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 1,966కి పెరిగింది.
* కర్ణాటకలో 2,627 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 38,843కు చేరుకుంది. ఇదే సమయంలో మృతి చెందిన 71 మందితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 684కు పెరిగింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని