గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

కరోనా పరిస్థితిని బట్టే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

భక్తులకు వైరస్‌ సోకలేదు: ఈవో

తిరుమల, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నందున సెప్టెంబరులో శ్రీవారికి నిర్వహించాల్సిన బ్రహ్మోత్సవాలపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆదివారం తిరుపతిలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి తక్కువ మంది భక్తులను అనుమతించడమా? లేదా? అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భక్తులకు దర్శనాలను ప్రారంభించిన జూన్‌ 11వ తేదీ నుంచి జులై 10వ తేదీ వరకు 1865 మంది తితిదే ఉద్యోగులకు తిరుమలలో, 1704 మంది భక్తులకు అలిపిరిలో కరోనా పరీక్షలు నిర్వహించామని వివరించారు. 91 మంది ఉద్యోగులకు పాజిటివ్‌ వచ్చిందని, భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించలేదని చెప్పారు.

దర్శనానికి రానివారు 30 శాతం
ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న వారిలో దాదాపు 25 నుంచి 30 శాతం మంది భక్తులు శ్రీవారి దర్శనానికి రాలేకపోయారని ఈవో తెలిపారు. జూన్‌ 11 నుంచి ఆన్‌లైన్‌లో 2,02,346 మంది భక్తులు బుక్‌ చేసుకోగా 1,64,742 మంది దర్శించుకున్నారని వెల్లడించారు. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 97,216 మంది భక్తులు దర్శన టోకెన్లు పొందగా.. 85,434 మంది స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. ప్రజలు వారి నివాస ప్రదేశాల్లో ఉన్న లాక్‌డౌన్‌ నిబంధనలు, ఇతర రాష్ట్రాల నుంచి అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను పరిశీలించి టికెట్లను తీసుకోవాలని ఈవో కోరారు. రోజుకు 12వేల మందినే ప్రస్తుతం దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు.

తితిదేకి ఆర్థికంగా ఇబ్బంది లేదు
ప్రస్తుతం భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తగ్గినా తితిదే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడటం లేదని ఈవో స్పష్టం చేశారు. జూన్‌ 11 నుంచి ఈనెల 10వరకు శ్రీవారికి హుండీ ద్వారా రూ.16.73 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. శనివారం నాటి హుండీ లెక్కింపుల్లో ఓ భక్తుడు సమర్పించిన బంగారు బిస్కెట్లు ఉన్నాయని చెప్పారు. తితిదే గతనెల 30న నిర్వహించిన తలనీలాల టెండర్లలో దాదాపు రూ.7.23 కోట్ల ఆదాయం లభించిందన్నారు.

కరోనా ముగిశాక శ్వేతపత్రం..
దస్త్రాలను పరిశీలించిన తర్వాత తితిదే ఆస్తులపై శ్వేతపత్రం ప్రకటిస్తామని ఈవో తెలిపారు. అది ఇప్పుడే కాదని, కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత జరగొచ్చని వివరించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని