సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

నిరర్థక ఆస్తులని గతంలోనే గుర్తించారు

విక్రయించే, లీజుకిచ్చే అధికారం ఉంది
తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి

ఈనాడు, తిరుపతి: ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో వేలం ద్వారా అమ్మాలనుకుంటున్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏ మాత్రం ఉపయోగపడవని, 1990లో ఇచ్చిన జీవో 311 మేరకు తితిదేకు ఆస్తుల విక్రయం, లీజుకిచ్చే అధికారాలు ఉన్నాయని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ధర్మకర్తల మండలి నిర్ణయాలకు, ప్రభుత్వానికి సంబంధం లేదంటూ తితిదే ప్రజా సంబంధాల విభాగం శనివారం ఆయన పేరుతో ఓ ప్రకటన జారీచేసింది. ‘‘దేవస్థానంలో నిరర్థక ఆస్తుల విక్రయ ప్రక్రియ 1974 నుంచి ఉంది. 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలంలో అమ్మారు. చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తితిదేకు ఉపయోగపడని ఆస్తులను వేలం వేసేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఓ సబ్‌కమిటీ నియమించారు. వీరి నివేదిక మేరకు 2016లోనే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా 50 నిరర్థక ఆస్తులను గుర్తించి వేలం వేసేందుకు నాటి ధర్మకర్తల మండలి తీర్మానించింది. దీనిపై అధికారులు ఏపీ గ్రామీణ ప్రాంతాల్లోని 17 ఆస్తులు, పట్టణ ప్రాంతాల్లోని 9, తమిళనాడులోని 23 ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ మదింపు విలువ, మార్కెట్‌ విలువ వివరాలు సేకరించి మండలికి నివేదించారు. ఒక ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉన్నందున దాన్ని వేలం నుంచి మినహాయించారు. రిషికేశ్‌లో 1.20 ఎకరాల భూమి తితిదేకు ఉపయోగపడకపోగా, కబ్జాకు గురవుతుందని గుర్తించి వేలం జాబితాలో చేర్చారు. ఈ 50 నిరర్థక ఆస్తుల విలువ రూ.23.92 కోట్లు. గత మండలి నిర్ణయాల అమలు మేరకు వీటిని అమ్మాలని మాత్రమే ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించాం. ఈ ఆస్తులన్నీ 1 నుంచి 5 సెంట్ల లోపు ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు సాగు భూములు. ఉపయోగపడని ఈ భూములు ఆక్రమణదారుల పాలు కాకుండా వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించాం’’ అని సుబ్బారెడ్డి వివరించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని