సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

కృష్ణా జలాల విడుదలకు సీఎంకు విజ్ఞాపన : ఎమ్మెల్యే

బాలాయపల్లి, న్యూస్‌టుడే : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కండలేరు ఆనకట్టకు కృష్ణా జలాలను విడుదల చేయాలని రాజధానిలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెల్లడించారు. కనీసం ఐదు టీఎంసీల నీటినైనా తెప్పించుకోవడానికి తాను సీఎంను కోరనున్నట్లు తెలిపారు. బాలాయపల్లిలో బుధవారం సాయంత్రం రైతు రథం పథకంలో పలువురికి ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ మూడో సంవత్సరం వరుసగా తీవ్ర వర్షాభావం నెలకొందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవిలో నిమ్మ, మామిడి పండ్ల తోటలను కాపాడుకోవడం రైతులకు కష్టతరమన్నారు. ఈ దృష్ట్యా ఇప్పుడే కృష్ణా జలాలను సోమశిల ద్వారా విడుదల చేయాలని సీఎంకు విజ్ఞాపన ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ విషయమై జిల్లా మంత్రులు సోమిరెడ్డి, నారాయణకు వివరించామన్నారు. రైతులకు సాధ్యంకాని స్థాయిలో రుణమాఫీ చేసిన తెదేపా మిగతా సొమ్మును నెలాఖరులో బ్యాంకుల్లో జమ చేయడానికి సన్నాహాలు చేస్తోందన్నారు. రైతు రథం పథకంలో ఇప్పటికి 228 ట్రాక్టర్లను నియోజకవర్గంలో పంపిణీ చేశామన్నారు. ఉద్యాన, వ్యవసాయశాఖల ఆధ్వర్యాన అనేక రూపాల్లో రైతులకు రాయితీ పరికరాలు, ఎరువులు వంటివి అందజేసి ఆదుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా పలువురికి ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, థైవాన్‌ స్ప్రే యంత్రాలు తదితరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెట్లూరు నిమ్మ చీని పరిశోధనా సంస్థ అధిపతి డాక్టర్‌ బీజీ రాజులు, వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రవీణ, ఉద్యాన అధికారి ఆనంద్‌, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, నేతలు రాయి మస్తానయ్య నాయుడు, కొర్రపాటి రామచంద్రయ్య నాయుడు, కల్యాణిరెడ్డి, సీసీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పలువురికి సీఎం రిలీఫ్‌ ఫండును చెక్కుల రూపంలో ఎమ్మెల్యే అందించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని