గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

తొలి బయోబబుల్‌ టెస్టు విజేత విండీస్‌

ఇంగ్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం

సౌథాంప్టన్‌‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో విండీస్‌దే పైచేయి అయ్యింది. తొలి బయోబబుల్‌ టెస్టు‌లో ఆ జట్టు ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ ఆరు వికెట్లను కోల్పోయి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఛేజ్‌ 37, బ్లాక్‌వుడ్‌ 95, డౌరిచ్‌ 20 రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆర్చర్‌ 3, స్టోక్స్‌ 2, మార్క్‌ వుడ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ను మిడిలార్డర్‌ ముంచగా.. విండీస్‌ను గెలిపించడం విశేషం.

విండీస్‌కు మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

వర్షం దోబూచులాడిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్‌ టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 204 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌ 6, గాబ్రియేల్‌ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్‌ 318 పరుగులు చేసి 114 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 4, అండర్సన్‌ 3, బెస్‌ 2, మార్క్‌ వుడ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఇంగ్లాండ్‌ను అడ్డుకున్న విండీస్‌ బౌలర్లు

114 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు బర్న్స్‌ (42), సిబ్లీ (50) తొలి వికెట్‌కు 72 పరుగుల శుభారంభం ఇచ్చారు. డెన్లీ 29, జాక్‌ 79, స్టోక్స్‌ 46, ఆర్చర్‌ 23, పోప్‌ 12 పరుగులు చేశారు. అయితే, విండీస్‌ బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌ వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. కేవలం 60 పరుగులకే ఆఖరి ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌటై.. విండీస్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గాబ్రియేల్‌ 5, జోసెఫ్‌ 2, ఛేజ్ 2, హోల్డర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

స్కోరు వివరాలు..

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 204 ఆలౌట్‌

వెస్టిండీస్‌ తొలి ఇన్సింగ్స్‌ 310 ఆలౌట్‌

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 313 ఆలౌట్‌

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 200/6

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని