వెజ్‌ వెరైటీలు

Updated : 06/06/2021 06:40 IST
పులిహోర రుచి..

గుడిలో ప్రసాదంలా రావాలంటే!

గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. అదే ఇంట్లో తయారుచేస్తే ఆ కమ్మదనం రావడం లేదు. ఏం చేయాలి?                    

-భాగ్యమ్మ, వరంగల్‌

గుడిలో పెట్టే పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అదే రుచి ఇంట్లో కూడా రావాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి.
* పులిహోర తయారీలో చింతపండు గుజ్జు మాత్రమే వాడాలి. నిమ్మకాయతో ఆ రుచి రాదు. చింతపండు గుజ్జుని తగినంత నూనెలో ఉడికించుకోవాలి. గుజ్జులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు చివర్లో వేసుకోవాలి. ముందే వేసుకుంటే గుజ్జు చిక్కబడ్డాక ఉప్పు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
* పులిహోర నువ్వులనూనెతో చేస్తే గుడిలో చేసే ప్రసాదం రుచిలా వస్తుంది.
* సెనగపప్పు- ఒకటిన్నర చెంచా, మినప్పప్పు-చెంచా, ధనియాలు- అర చెంచా, ఎండుమిర్చి- నాలుగైదు, మెంతులు- అరచెంచా, నువ్వులు- చెంచా... వీటన్నింటినీ  చిన్న మంటపై కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి, చల్లార్చి పొడి చేసుకోవాలి. వేయించే సమయంలో నువ్వులను చివరగా వేసుకోవాలి లేదంటే మాడిపోతాయి.
* తాలింపులో ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుతోపాటు సన్నగా తరిగిన అల్లం ముక్కలూ వేయాలి.  
* అన్నంలో మొదట చింతపండు గుజ్జు, ఆ తర్వాత తాలింపు, చివరగా పొడి కలిపితే అద్భుతంగా ఉంటుంది.
* కొన్ని గుళ్లలో మసాలా పొడిలో ఆవాలు వేస్తే,   మరికొందరు మిరియాలు జత చేస్తారు.
*తయారుచేసిన పొడిని చింతపండు గుజ్జులో కలిపి చేయడం మరో పద్ధతి.


                 - శ్రీదేవి, హోటల్‌మేనేజ్‌మెంట్‌ నిపుణురాలు                      

 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని