వెజ్‌ వెరైటీలు

Updated : 30/05/2021 05:40 IST
మామిడికాయ పచ్చిపులుసు

పాఠక వంట

కావాల్సినవి

మామిడికాయ- ఒకటి, ఉల్లిపాయ ముక్కలు- చిన్న కప్పు, వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది, ఎండుమిర్చి- రెండు, పోపుగింజలు- చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, పసుపు, ఇంగువ- చిటికెడు చొప్పున, ఉప్పు- తగినంత, బెల్లం తురుము- కొద్దిగా, కారం- చెంచా, నూనె- రెండు చెంచాలు.
తయారీ

మామిడికాయను కుక్కర్‌లో వేసి, కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి గుజ్జును బాగా మెదపాలి. గిన్నెలో పసుపు, ఉప్పు, కారం, బెల్లం తురుము వేసి కలపాలి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి కలపాలి. ఇందులోనే వెల్లుల్లి, ఎండుమిర్చి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ పోపును మామిడి చారులో కలపాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చిపులుసు వేసవిలో చలువ చేస్తుంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని