వెజ్‌ వెరైటీలు

Updated : 15/06/2021 12:38 IST
మండుటెండల్లో సల్లసల్లగా!

మండే ఎండల్లో  కడుపులో చల్లగా ఉండాలంటే రుచికరమైన, పోషకభరిత మజ్జిగను తాగాల్సిందే. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందామా...

జ్జిగలో సోడియం, క్యాల్షియం మూలకాలు మెండుగా ఉంటాయి. వీటితోపాటు ప్రొటీన్లు, మినరల్స్‌ కూడా. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలను అందిస్తాయి.  
* దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గుముఖం పడతాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎముకలకూ కావాల్సిన బలాన్నీ అందజేస్తుంది.
* మజ్జిగ శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించేస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచి బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవడానికి సాయపడుతుంది. అజీర్తీ, ఎసిడిటీ సమస్యలను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  
* బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఉదయం గ్లాసు మజ్జిగలో చెంచా తేనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.    
* పైల్స్‌ సమస్యతో ఇబ్బందిపడేవారు గ్లాసు మజ్జిగలో అర చెంచా శొంఠి పొడిని వేసుకుని తాగితే ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం లభిస్తుంది.
* పాలు పడనివారు, మధుమేహులు..  ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవచ్చు.  
* వేయించిన జీలకర్ర, ధనియాల పొడిని మజ్జిగలో కలిపి రోజూ తీసుకుంటే చలువ చేయడంతోపాటు వాతం, కఫం లాంటి సమస్యలు తగ్గుతాయి. మజ్జిగలో కాస్తంత శొంఠి పొడి వేసుకుని తాగితే ఆకలి పెరుగుతుంది.
ఇలానూ తాగొచ్చు... కప్పు పెరుగులో కాసిన్ని నీళ్లు పోసి బాగా గిలకొట్టాలి. దీంట్లో  కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగు, పావు చెంచా జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి  గ్రైండ్‌ చేసుకుని తీసుకోవచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని