Published : 13/06/2021 01:13 IST
తియ్యటి నీటిచుక్కలను... తినేద్దామా!

ఫుడ్‌ ఆర్ట్‌

వర్షపు జల్లుల్లో తడిసి ముద్దవుతూ... కాగితపు పడవలతో వాన నీటిలో ఆటలాడుతూ... ఆహా... బాల్యం జ్ఞాపకాలు ఎంత మధురమో కదా..

తీపి జ్ఞాపకాలను మరోసారి మీకు రుచి చూపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తోన్న ‘రెయిన్‌ థీమ్డ్‌ కుకీస్‌’. వర్షపు జల్లులు... నీటి బొట్టు, మేఘం, గొడుగు... ఇలా పలు ఆకారాల్లో కుకీస్‌ను తయారుచేస్తూ చిన్నా, పెద్దా అందరి నోళ్లనూ తీపి చేస్తున్నారు తయారీదారులు. మరెందుకాలస్యం ఆ మధురానుభూతులను గుర్తు తెచ్చుకుంటూ మీరూ తినేయండి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని