Updated : 30/05/2021 05:44 IST
కాఫీ కప్పులో చెవుల పిల్లి!

ఫుడ్‌ ఆర్ట్‌

వేడి వేడి కాఫీ చేతికందగానే వెంటనే ఒక గుక్క తాగి ఆస్వాదిస్తాం. అయితే ఆ కాఫీలో రుచితోపాటు చూడచక్కని చిత్రాలు మిమ్మల్ని ఆకర్షిస్తే ఎలా ఉంటుంది? కాఫీ నురగతో రకరకాల ఆకారాలను/ఆకృతులను వేయడాన్ని లాటే ఆర్ట్‌ అని పిలుస్తారు. ఇది ఇప్పుడిప్పుడే మనదేశంలోనూ విస్తరిస్తోంది. సింగపూర్‌కు చెందిన పదిహేడేళ్ల అమ్మాయి... డఫ్నె టాన్‌ ఏకంగా 3డీ లాటేలతో కాఫీ ప్రియుల మనసు దోచుకుంటోంది. పాలనురగ/ క్రీమ్‌తో కాఫీనురగపై పిల్లి, పులి, జిరాఫీ, ఆక్టోపస్‌... ఇలా రకరకాల జంతువులను చూడచక్కగా రూపొందిస్తోంది.  ఇంటర్నెట్‌లో ఈ ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కాఫీ కప్పులో తేలియాడే ఆ అందమైన బొమ్మలను చూసేయండి మరి.

 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని